Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

యూఎస్‌ ఓపెన్‌ ఫైనల్లో నాదల్.. మెద్వెదేవ్‌తో అమీతుమీ

US Open 2019: Rafael Nadal, Daniil Medvedev final closes the US Open

న్యూయార్క్‌: యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్ హవా కొనసాగుతోంది. చిరకాల ప్రత్యర్థులు జొకోవిచ్, ఫెడరర్‌ ముందే నిష్క్రమించిన చోట నాదల్‌ జోరు ముందు ఎవరూ నిలవలేకపోతున్నారు. మట్టి కోర్టులోనే కాదు ఎక్కడైనా సత్తా చాటుతానని నిరూపిస్తూ యూఎస్ ఓపెన్‌ ఫైనల్‌కు దూసుకెళ్లాడు. ఇక 19వ గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌కు ఒక్క అడుగు దూరంలో నిలిచాడు. ఫైనల్లో గెలిచి ఫెదరర్ (20) తర్వాత అత్యధిక గ్రాండ్‌స్లామ్‌లు సాధించిన రికార్డుకు మరింత చేరువ కావాలని నాదల్ చూస్తున్నాడు.

బ్రెటినీపై నాదల్ విజయం:

బ్రెటినీపై నాదల్ విజయం:

శనివారం జరిగిన పురుషుల సింగిల్స్ సెమీఫైనల్లో రెండో సీడ్ నాదల్ 7-6(8/6), 6-4, 6-1 తేడాతో 24వ సీడ్ మెటియో బ్రెటినీ (ఇటలీ)పై విజయం సాధించాడు. 2గంటల 35 నిమిషాల పాటు సాగిన మ్యాచ్‌లో నాదల్ దూకుడుకు తాళలేక తప్పిదాలు చేసి బ్రెటినీ ఇంటిదారి పట్టాడు. 42 ఏళ్లలో యుఎస్‌ ఓపెన్‌ పురుషుల సింగిల్స్‌లో సెమీస్‌ చేరిన తొలి ఇటలీ ఆటగాడిగా రికార్డు సృష్టించిన బెరెటిని సెమీఫైనల్లో నిరాశపరిచాడు. నాదల్‌ మొదటి సెట్‌లో కొంత పోరాడాల్సి వచ్చింది. ఆ తర్వాత రెండో సెట్‌లో కాస్త సులువుగా.. మూడో సెట్‌లో తిరుగులేని విధంగా అతని ప్రదర్శన సాగింది. ఈ మ్యాచ్‌లో నాదల్‌ (31)కంటే బెరెటిని ఎక్కువ విన్నర్లు (37) కొట్టినా.. ఏకంగా 44 అనవసర తప్పిదాలు చేసి మూల్యం చెల్లించుకున్నాడు.

మెద్వెదెవ్‌కు తొలి ఫైనల్:

మెద్వెదెవ్‌కు తొలి ఫైనల్:

శనివారం జరిగిన మరో సెమీస్‌లో ఐదో సీడ్ మెద్వదెవ్ (రష్యా) 7-6(7/5), 6-4, 6-3 తేడాతో అన్‌సీడెడ్ గ్రిగొరి దిమిత్రోవ్ (బల్గేరియా)పై విజయం సాధించాడు. 2గంటల 38 నిమిషాల పాటు మ్యాచ్ సాగింది. 10 ఏస్‌లు 22 విన్నర్లతో మెద్వదెవ్ చెలరేగగా.. దిమిత్రోవ్ 2 ఏస్‌లకే పరిమితమయ్యాడు. 39విన్నర్లు సాధించినా.. 46 తప్పిదాలతో గ్రిగొరి ఇంటిదారి పట్టాడు. ఈ విజయంతో 14 ఏళ్ల తర్వాత ఫైనల్‌కు చేరిన రష్యన్‌ ఆటగాడిగా మెద్వెదెవ్‌ రికార్డు నెలకొల్పాడు. ఆదివారం జరగనున్న ఫైనల్లో మెద్వెదెవ్‌తో నాదల్‌ తలపడనున్నాడు. నాదల్‌కు కెరీర్‌లో ఇది 27వ ఫైనల్ కాగా.. మెద్వెదెవ్‌కు తొలి ఫైనల్.

బిగ్‌ త్రీ శకం ముగుస్తోంది:

బిగ్‌ త్రీ శకం ముగుస్తోంది:

మ్యాచ్ అనంతరం నాదల్ మాట్లాడుతూ... 'ఫెదరర్, జొకోవిచ్, నాదల్ తరం త్వరలో ముగిసిపోతుంది. చాలా కాలం కొనసాగాలని మేం అనుకోవడం లేదు. నాకు 33 ఏండ్లు, ఫెదరర్‌కు 38, జొకోవిచ్‌కు 32, ముర్రేకు 32 ఏళ్లు. కాలం ఎవరికోసం ఆగదు. మా తరం ముగుస్తుందని నాకు ఆందోళన లేదు. టెన్నిస్‌కు గొప్ప చాంపియన్లు ఎప్పుడూ ఉంటారు. థీమ్, మెద్వదెవ్, జ్వెరెవ్, సిట్సిపాస్ లాంటి ఆటగాళ్లు ప్రస్తుతం స్టార్లుగా ఎదుగుతున్నారు. అయితే మునుపటి తరాల్లో ఎన్నడూ లేని విధంగా టెన్నిస్ ప్రపంచంలో బిగ్‌త్రీ ఆధిపత్యం చెలాయించింది' అని అన్నారు.

Story first published: Sunday, September 8, 2019, 10:40 [IST]
Other articles published on Sep 8, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+