Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

గాఫ్‌ జోరుకు ఒసాకా బ్రేక్‌.. బార్టీకి షాక్.. క్వార్టర్స్‌లో ఫెడరర్‌

US Open 2019:Naomi Osaka ends Coco Gauffs US Open run, Ash Barty thrashed by Wang Qiang

న్యూయార్క్‌: అమెరికా యువ సంచలనం కోరి గాఫ్‌ యూఎస్‌ ప్రస్థానం ముగిసింది. ఫ్రెంచ్‌ ఓపెన్‌ మూడో రౌండ్‌లో టాప్‌సీడ్‌, డిఫెండింగ్‌ చాంపియన్‌ నయోమి ఒసాకా (జపాన్‌) 6-3, 6-0తో కోరి గాఫ్‌ను ఓడించింది. గత రెండు గ్రాండ్‌స్లామ్‌ టోర్నీలలో అద్భుత ప్రదర్శనతో మహామహులను ఓడించిన గాఫ్‌.. తొలి సెట్‌లో కాస్త ప్రతిఘటన చూపింది. ఇక రెండో సెట్‌లో ఒసాకా దూకుడు ముందు పూర్తిగా తేలిపోయి ఓటమి పాలైంది. సొంతగడడ్డపై ఓడిన బాధలో గాఫ్‌ కోర్టులోనే ఏడ్చేసింది. ఇది చూసిన ఒసాక.. గాఫ్‌ వద్దకు వెళ్లి ఆమెను ఓదార్చింది. ఒసాక తదుపరి రౌండ్‌లో స్విట్జర్లాండ్‌కు చెందిన 13వ సీడ్‌ బెలిండా బెన్కిక్‌తో తలపడనుంది.

స్టార్ ప్లేయర్ రెండో సీడ్‌ యాష్లే బార్టీ (ఆస్ట్రేలియా) యూఎస్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ నుంచి నిష్క్రమించింది. మహిళల సింగిల్స్‌ ప్రిక్వార్టర్స్‌లో బార్టీ 2-6, 4-6తో 18వ సీడ్‌ కియాంగ్‌ వాంగ్‌ (చైనా) చేతిలో ఓడింది. రెండోరౌండ్‌లో వాకోవర్‌ లభించడంతో రోహన్‌ బోపన్న-డెనిస్‌ షపొవలోవ్‌ (కెనడా) జోడీ డబుల్స్‌ ప్రీ క్వార్టర్స్‌ చేరింది. పురుషుల సింగిల్స్‌లో స్విస్‌ స్టార్‌ రోజర్‌ ఫెదరర్‌ టైటిల్‌ దిశగా సాగుతున్నాడు. పురుషుల సింగిల్స్‌లో 13వసారి క్వార్టర్‌ఫైనల్లో అడుగుపెట్టాడు. ఆదివారం జరిగిన ప్రిక్వార్టర్స్‌లో ఫెదరర్‌ 6-2, 6-2, 6-0తో 16వ సీడ్‌ డేవిడ్‌ గాఫిన్‌ (బెల్జియం)ను చిత్తుగా ఓడించాడు. ఈ మ్యాచ్‌లో గాఫిన్‌ కనీస పోటీ ఇవ్వలేకపోయాడు.

స్పెయిన్ బుల్ రఫెల్‌ నదల్‌ మూడోరౌండ్‌లో 6-3, 6-4, 6-2తో దక్షిణ కొరియా క్వాలిఫయర్‌ చంగ్‌ హ్యూన్‌పై నెగ్గాడు. క్వార్టర్స్‌లో స్థానం కోసం 2014 విజేత మారిన్‌ సిలిచ్‌ను నదల్‌ ఢీకొంటాడు. సిలిచ్‌ (క్రొయేషియా) 4-6, 6-3, 7-5, 6-3తో 14వ సీడ్‌ జాన్‌ ఇస్నర్‌ (అమెరికా)ను ఓడించాడు. ఆరో సీడ్‌ అలెగ్జాండర్‌ జ్వెరేవ్‌ (జర్మనీ) 6-7 (7), 7-6, (7), 6-3, 7-6 (7)తో అల్జాజ్‌ బెడెన్‌ (స్లొవేనియా)పై.. ఆండ్రీ రుబ్లేవ్‌ (రష్యా) 7-6 (7), 7-6 (7), 6-3తో నిక్‌ కిర్గియోస్‌ (ఆస్ట్రేలియా)పై.. మోన్‌ఫిల్స్‌ (ఫ్రాన్స్‌) 6-7 (5), 7-6 (7), 6-4, 6-7 (6), 6-3తో షపోవలోవ్‌ (కెనడా)పై.. 24వ సీడ్‌ బెరెటిని (ఇటలీ) 6-4, 6-4, 6-7 (3), 7-6 (7)తో పాపిరిన్‌ (ఆస్ట్రేలియా)పై గెలిచి ప్రీ క్వార్టర్‌ఫైనల్లోకి దూసుకొచ్చారు.

Story first published: Monday, September 2, 2019, 11:04 [IST]
Other articles published on Sep 2, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+