'టెన్నిస్ నా నరనరాన జీర్ణించుకుపోయింది.. ఓటమిని అస్సలు ఇష్టపడను'

న్యూయార్క్: టెన్నిస్ అంటే ప్యాషన్. అది నా నరనరాన జీర్ణించుకుపోయింది. అందుకే ఓటమిని నేను అస్సలు ఇష్టపడను అని యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీ విజేత, కెనడా ప్లేయర్ బియాంక అండ్రెస్కు తెలిపారు. యూఎస్ ఓపెన్ మహిళల సింగిల్స్ ఫైనల్లో 15వ సీడ్ బియాంక 6-3, 7-5తో 8వ సీడ్, 23 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ విజేత సెరెనా విలియమ్స్ (అమెరికా)పై విజయం సాధించింది.
దీంతో గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్ గెలిచిన తొలి కెనడా ప్లేయర్‌గా రికార్డు సృష్టించడమే కాక.. రష్యా అందం మారియా షరపోవా (2006, యూఎస్ ఓపెన్) తర్వాత గ్రాండ్‌స్లామ్ టైటిల్ నెగ్గిన అతి పిన్న వయస్కురాలిగా చరిత్రకెక్కింది.

సెరెనాపై గెలువడం మరిచిపోలేను:
మ్యాచ్ అనంతరం బియాంక మాట్లాడుతూ... 'నా ఆనందాన్ని మాటల్లో చెప్పలేను. ఈ క్షణం కోసం నేను ఎంతో కష్టపడ్డా. ఎప్పటి నుంచో కలలు కన్న సీజన్ ఇది. చాలా అద్భుతంగా సాగింది. టెన్నిస్ లెజెండ్ సెరెనాపై గెలువడం మరిచిపోలేని అనుభూతి. ప్రత్యర్థి ఎవరనే విషయాన్ని పక్కన పెట్టి విజయం సాదించడంపైనే దృష్టి సారించా. ఏడాది క్రితం యూఎస్ ఓపెన్ ఫైనల్ చేరుతానని ఊహించలేదు. నా కఠోర శ్రమకు ఫలితం దక్కింది. ఇలాంటి ఓ రోజు వస్తుందని నేను ముందే ఊహించా' అని బియాంక తెలిపారు.

టెన్నిస్ అంటే ప్యాషన్:
'టెన్నిస్ అంటే ప్యాషన్. అది నా నరనరాన జీర్ణించుకుపోయింది. అందుకే ఓటమిని నేను అస్సలు అంగీరించను. ప్రతి మ్యాచ్‌లోనూ ఉత్తమంగా ఆడటానికి ప్రయత్నిస్తా. నా నుంచి నేను ఎంతో ఆశిస్తా. అది ఒత్తిడి పెంచుతుందని తెలుసు. అందుకే.. ప్రతి మ్యాచ్‌లోనూ 100 శాతం ప్రదర్శన ఇచ్చేందుకు కష్టపడుతా' అని బియాంక పేర్కొన్నారు.

నా జీవితంలో ఎప్పుడూ అందుకోలేదు:
ఈ గొప్ప విజయం సాధించిన క్రమంలో ప్రతి అంశాన్ని గుర్తుంచుకుంటా. నా లక్ష్యం సాధ్యమైనన్ని గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ సాధించడమే. ఇక ప్రపంచ నంబర్‌వన్ కావడం మిగిలింది. ఈ గెలుపుతో వచ్చిన ప్రైజ్‌మనీని ఏం చేయాలో ఇంకా ఆలోచించలేదు. ఇంత భారీ మొత్తాన్ని నా జీవితంలో ఎప్పుడూ అందుకోలేదు' అని బియాంక చెప్పుకొచ్చారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications