
ఆష్లే బార్టీ@1
ఆస్ట్రేలియాకు చెందిన ఆష్లే బార్టీ మళ్లీ నెంబర్‌వన్ ర్యాంక్‌ను చేరుకుంది. ప్లిస్కోవా, స్విటోలినా వరుసగా రెండు, మూడు ర్యాంకుల్లో కొనసాగుతున్నారు. యూఎస్ ఓపెన్‌లో విఫలమైన డిఫెండింగ్ చాంపియన్ నవోమి ఒసాక టాప్ ర్యాంక్ నుంచి నాలుగో ర్యాంక్‌కు పడిపోయింది. సెరెనా ఒక స్థానం కోల్పోయి 9వ ర్యాంక్‌కు చేరింది. హలెప్, క్విటోవా, బెర్టెన్స్, బెలిండా టాప్-10లో ఉన్నారు.

జొకోవిచ్ @1
పురుషుల సింగిల్స్‌లో యూఎస్ ఓపెన్ విజేత, స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్ రెండో ర్యాంక్‌ను నిలబెట్టుకున్నాడు. సెర్బియా స్టార్ నొవాక్ జొకోవిచ్ నెంబర్‌వన్ ర్యాంక్‌ను కాపాడుకున్నాడు. రోజర్ ఫెదరర్ మూడో ర్యాంక్‌లో ఉన్నాడు. యూఎస్ ఓపెన్ రన్నరప్ మెద్వెదేవ్ ఓ స్థానం ఎగబాకి నాలుగో స్థానానికి చేరుకున్నాడు. డొమినిక్ థీమ్ ఐదో ర్యాంక్‌తో టాప్-5లో ఉన్నాడు. భారత యువ ఆటగాడు సుమిత్ నాగల్ కెరీర్‌లో అత్యుత్తమంగా 174వ ర్యాంక్‌కు చేరాడు.

బియాంక చరిత్ర:
యూఎస్ ఓపెన్ మహిళల సింగిల్స్ ఫైనల్లో బియాంక అండ్రెస్కు 6-3, 7-5తో 8వ సీడ్, 23 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ విజేత సెరెనా విలియమ్స్ (అమెరికా)పై విజయం సాధించిన విషయం తెలిసిందే. దీంతో గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్ గెలిచిన తొలి కెనడా ప్లేయర్‌గా రికార్డు సృష్టించడమే కాక.. రష్యా అందం మారియా షరపోవా (2006, యూఎస్ ఓపెన్) తర్వాత గ్రాండ్‌స్లామ్ టైటిల్ నెగ్గిన అతి పిన్న వయస్కురాలిగా చరిత్రకెక్కింది.

19వ గ్రాండ్‌స్లామ్:
యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీ పురుషుల సింగిల్స్‌లో భాగంగా ఆదివారం జరిగిన ఫైనల్లో రెండో సీడ్ నాదల్ 7-5, 6-3, 5-7, 4-6, 6-4 తేడాతో ఐదో సీడ్ మెద్వదెవ్ (రష్యా)పై అద్భుత విజయాన్ని అందుకున్నాడు. ఈ విజయంతో నాదల్ 19వ గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. నాదల్‌కు ఇది నాలుగవ యుఎస్ ఓపెన్ టైటిల్. నాలుగు గంటల 50 నిమిషాల పాటు ఈ మ్యాచ్ హోరాహోరీగా సాగింది. తొలి రెండు సెట్‌లను గెలిచిన నాదల్.. అనవసర తప్పిదాలు చేసి మూడు, నాలుగు సెట్‌లను ప్రత్యర్థికి అప్పగించాడు. ఇక నిర్ణయాత్మక ఐదవ సెట్‌లో తన అనుభవాన్ని ఉపయోగించి సెట్‌తో పాటు మ్యాచ్ గెలుచుకున్నాడు.


Click it and Unblock the Notifications












