న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సెరెనా కలలకు చెక్.. ఎస్‌ ఓపెన్‌ విజేత బియాంకా ఆండ్రిస్కూ

US Open 2019: Bianca Andreescu beats Serena Williams to win title

న్యూయార్క్‌: యూఎస్ ఓపెన్‌లో కెనడా టీనేజర్ బియాంక ఆండ్రెస్కు సత్తా చాటింది. రికార్డు స్థాయిలో పదోసారి యూఎస్ ఓపెన్ ఫైనల్‌కు వచ్చిన అమెరికా అగ్రశ్రేణి క్రీడాకారిణి సెరెనా విలియమ్స్‌ను తొలి గ్రాండ్‌స్లామ్ ఆడుతున్న బియాంక మట్టికరిపించింది. మహిళల సింగిల్స్‌లో భాగంగా శనివారం జరిగిన ఫైనల్లో 15వ సీడ్ బియాంక 6-3, 7-5 తేడాతో సెరెనాను చిత్తుగా ఓడించింది. దీంతో బియాంక కెరీర్‌లో తొలి టైటిల్‌ను అందుకుంది.

<strong>4 బంతుల్లో 4 వికెట్లు: ర్యాంకింగ్స్‌లో 20 స్ధానాలు ఎగబాకిన మలింగ</strong>4 బంతుల్లో 4 వికెట్లు: ర్యాంకింగ్స్‌లో 20 స్ధానాలు ఎగబాకిన మలింగ

సెరెనా కలలకు చెక్:

సెరెనా కలలకు చెక్:

ఈ ఓటమితో టెన్నిస్‌ చరిత్రలో అత్యధిక టైటిళ్లు (24) సాధించాలనుకున్న 37 ఏళ్ల సెరెనా విలియమ్స్‌ కలను బియాంకా ఆండ్రిస్కూ అడ్డుకుంది. ఇప్పటివరకు గ్రాండ్‌స్లామ్‌లో రెండో రౌండ్‌ కూడా దాటని బియాంకా.. యూఎస్ ఓపెన్‌ టైటిల్‌ను నెగ్గి రికార్డులు సృష్టించింది. సింగిల్స్‌లో గ్రాండ్‌స్లామ్‌ను అందుకున్న తొలి కెనడా క్రీడాకారిణిగా బియాంకా రికార్డుల్లోకెక్కింది. గత 13 ఏళ్లలో టైటిల్‌ను అందుకున్న తొలి టీనేజర్‌గానూ రికార్డు సృష్టించింది.

 ఏకపక్షంగా ఫైనల్ మ్యాచ్:

ఏకపక్షంగా ఫైనల్ మ్యాచ్:

తొలి సెట్‌లో బియాంకా ఆధిపత్యం ఏకపక్షంగా సాగినా.. రెండో సెట్‌లో సెరెనా పుంజుకుని బియాంకాకు గట్టి పోటీ ఇచ్చింది. ఇదే సమయంలో బియాంకా చెలరేగి రెండో సెట్‌ను కూడా కైవసం చేసుకోని యూఎస్ ఓపెన్‌ విజేతగా నిలిచింది. ఒకవైపు టెన్నిస్‌లో సుధీర్ఘ అనుభవం, ఆరుసార్లు ఛాంపియన్ అయిన సెరెనా.. మరోవైపు తొలి గ్రాండ్‌స్లామ్ ఆడుతున్న బియాంక మధ్య పోరు రసవత్తరంగా సాగుతుందనుకుంటే ఏకపక్షంగా సాగింది.

అద్భుతమైన ఆటతీరుతో:

గురువారం జరిగిన మహిళల సింగిల్స్‌ సెమీ ఫైనల్ మ్యాచ్‌లో ఐదో సీడ్ స్వితొలినాపై 6-3,6-1 తేడాతో సెరెనా విలియమ్స్‌ విజయం సాధించి ఫైనల్ చేరిన విషయం తెలిసిందే. శుక్రవారం జరిగిన సెమీస్‌లో బియాంక 7-6(3) 7-5తో 13వ సీడ్ బెలిండా బెన్సిక్ (స్విట్జర్లాండ్)ను చిత్తుగా ఓడించి ఫైనల్ చేరింది. సరిగ్గా 20 ఏళ్ల క్రితం సెరెనా విలియమ్స్ తొలిసారి యూఎస్ ఓపెన్ (1999) టైటిల్ ముద్దాడింది. అప్పటికి ఇంకా బియాంక పుట్టనేలేదు. అలాంటిది ఇప్పుడు తన అద్భుతమైన ఆటతీరుతో ఫైనల్లో సెరెనాను ఓడించింది.

Story first published: Sunday, September 8, 2019, 9:56 [IST]
Other articles published on Sep 8, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X