యూఎస్ ఓపెన్: చరిత్ర సృష్టించిన బియాంక.. ఫైనల్లో సెరెనాతో ఢీ

న్యూయార్క్: యూఎస్ ఓపెన్‌లో కెనడా టీనేజర్ బియాంక ఆండ్రెస్కు జోరు కొనసాగుతోంది. మరో అద్భుత ఆటతో 19ఏండ్ల బియాంక యూఎస్ ఓపెన్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. మహిళల సింగిల్స్‌లో భాగంగా శుక్రవారం జరిగిన సెమీస్‌లో 15వ సీడ్ బియాంక 7-6(3) 7-5తో 13వ సీడ్ బెలిండా బెన్సిక్ (స్విట్జర్లాండ్)ను చిత్తుగా ఓడించింది. మహిళల సింగిల్స్‌లో ఒక కెనడా క్రీడాకారిణి ఫైనల్ ఆడడం ఇదే తొలిసారి. మరోవైపు బియాంకకు ఇదే తొలి గ్రాండ్‌స్లామ్ ఫైనల్ కావడం విశేషం. 2009లో వోజ్నియాకి తర్వాత యూఎస్ ఓపెన్ సెమీస్ చేరిన తొలి టీనేజర్‌గా నిలిచి రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే.
సెరెనాతో అమితుమీ:
2 గంటల 12 నిమిషాల పాటు జరిగిన ఈ పోరులో బియాంక వరుస సెట్లలో విజయం సాధించింది. తొలి సెట్ సునాయాసంగా గెలిచినా.. రెండో సెట్లో మాత్రం తీవ్ర పోటీ ఎదురైంది. రెండో సెట్లో 2-5తో వెనకబడిన సమయంలో పుంజుకున్న బియాంక వరుసగా ఐదు పాయింట్లు చేసి సెట్‌తో పాటు మ్యాచ్‌ను కైవసం చేసుకుంది. ఇక శనివారం జరిగే ఫైనల్లో అమెరికా అగ్రశ్రేణి క్రీడాకారిణి సెరెనా విలియమ్స్‌తో బియాంక అమితుమీ తేల్చుకోనుంది. బియాంక చరిత్ర సృష్టించేందుకు కేవలం ఒక్క అడుగులో దూరంలో మాత్రమే నిలిచింది.
స్వితొలినాపై విజయం:
గురువారం జరిగిన మహిళల సింగిల్స్ సెమీ ఫైనల్ మ్యాచ్‌లో ఐదో సీడ్ స్వితొలినాపై 6-3,6-1 తేడాతో సెరెనా విలియమ్స్ విజయం సాధించింది. స్వితొలినాను వరుస సెట్లలో ఓడించి ఫైనల్లోకి వెళ్ళింది. గత ఆరు టోర్నీలలో సెరెనా నాలుగోసారి ఫైనల్ చేరింది. సెరెనా రికార్డు స్థాయిలో పదోసారి యూఎస్ ఓపెన్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. సొంతగడ్డపై మరో గ్రాండ్‌స్లామ్ టైటిల్ అందుకునేందుకు సెరెనా ఆరాటపడుతోంది.
సంచలనం నమోదయ్యేనా?:
సెరెనా ఇప్పటికే చాలా మంది గొప్ప మహిళా క్రీడాకారిణిల రికార్డులను బద్దలు కొట్టింది. ఇక ఆస్ట్రేలియన్ దిగ్గజం మార్గరెట్ కోర్ట్ ఆల్-టైమ్ గ్రాండ్ స్లామ్ సింగిల్స్ టైటిల్స్‌పై కన్నేసింది. ఒకవైపు టెన్నిస్‌లో సుధీర్ఘ అనుభవం, ఆరుసార్లు ఛాంపియన్ అయిన సెరెనా (37).. మరోవైపు తొలి గ్రాండ్‌స్లామ్ ఆడుతున్న బియాంక (19) మధ్య పోరు రసవత్తరంగా సాగనుంది. ఏదైనా సంచలనం నమోదయితే కానీ.. బియాంక ఫైనల్లో గట్టెక్కలేదు. సెరెనా బలమైన షాట్లను తట్టుకోవాలంటే బియాంక చమటోడ్చాల్సిందే.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications