ఎండవేడికి తట్టుకోలేక ఒకే మ్యాచ్‌లో 11 షర్ట్స్ మార్చిన ఆటగాడు

హైదరాబాద్: న్యూయార్క్ వేదికగా జరుగుతున్న యుఎస్ ఓపెన్‌లో ఈసారి మ్యాచ్‌ల కంటే ఎక్కువగా అక్కడి వేడి గురించే చర్చించుకుంటున్నారు. ఎండ వేడిమి దెబ్బకు ఆటగాళ్లు సెగలు కక్కుతున్నారు. తాజాగా, ఈ ఎండ వేడిమికి తట్టుకోలేక మాజీ వరల్డ్ నంబర్ వన్, స్విస్ టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెదరర్ కూడా క్వార్టర్స్‌లోనే ఇంటిదారి పట్టాడు.

ఎండ వేడిమికి తట్టుకోలేకపోయిన జాన్ ఇస్నర్
టెన్నిస్‌లో సుదీర్ఘ మ్యాచ్‌లు ఆడగలడని పేరున్న జాన్ ఇస్నర్ సైతం ఎండ వేడిమికి తట్టుకోలేకపోయాడు. యుఎస్ ఓపెన్ గ్రాండ్ స్లామ్ టోర్నీలో భాగంగా అర్జెంటీనా స్టార్ జువాన్ మార్టిన్ డెల్ పోట్రోతో జరిగిన క్వార్టర్స్‌లో ఎండ వేడిమి భరించలేక ఇస్నర్ ఏకంగా 11సార్లు షర్ట్‌లు మార్చాడంటే అక్కడ పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

మూడున్నర గంటల పాటు సాగిన మ్యాచ్
సుమారు మూడున్నర గంటల పాటు సాగిన ఈ మ్యాచ్‌లో ఇద్దరు ప్లేయర్లు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో యుఎస్ ఓపెన్ నిర్వహాకులు సైతం మూడు, నాలుగు సెట్ల మధ్య పది నిమిషాల పాటు ఆటగాళ్లకు బ్రేక్‌ను సైతం ఇస్తున్నారు.

బ్రేక్‌ను పూర్తిగా సద్వినియోగం ప్లేయర్లు
ఈ క్రమంలో క్వార్టర్స్‌లో వీరిద్దరికి లభించిన బ్రేక్‌ను పూర్తిగా సద్వినియోగం చేసుకున్నారు. చివరికి ఈ మ్యాచ్‌లో డెల్‌పోట్రోపై 6-7, 6-3, 7-6, 6-2 తేడాతో జాన్ ఇస్నర్ విజయం సాధించి సెమీఫైనల్లోకి దూసుకెళ్లాడు. మ్యాచ్ అనంతరం ఇస్నర్ మాట్లాడుతూ "వంద కిలోల బరువు, ఆరు అడుగులకు పైగా ఉండే తనకు చెమట కూడా బాగా ఎక్కువ పడుతుందని, ఇలాంటి వాతావరణంలో ఆడటం తమలాంటి వాళ్లకు చాలా కష్టం" అని చెప్పాడు.
ఫెదరర్ సైతం ఇలా
మరోవైపు యుఎస్ ఓపెన్ నాలుగో రౌండ్‌లో ఇంటిదారి పట్టిన స్విస్ టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెదరర్ కూడా ఇక్కడి వాతావరణంపై ఇలాంటి వ్యాఖ్యలే చేశాడు. పురుషుల సింగిల్స్ నాలుగో రౌండ్‌లో ఆస్ట్రేలియన్ అన్‌సీడెడ్ ప్లేయర్ జాన్ మిల్మన్ 2వ సీడ్‌గా బరిలోకి దిగిన రోజర్ ఫెదరర్‌ను చిత్తుగా ఓడించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ అనంతరం ఫెదరర్ మాట్లాడుతూ మ్యాచ్ మధ్యలో తాను ఊపిరి పీల్చుకోవడానికి కూడా ఇబ్బంది పడినట్లు చెప్పాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications