ఒసాకా తొలి గ్రాండ్ స్లామ్‌పై జపాన్ అభిమానుల సంబరాలు

హైదరాబాద్: నవోమీ ఒసాకా.. ప్రస్తుతం టెన్నిస్ ప్రపంచంలో మార్మోగిపోతున్న పేరు. న్యూయార్క్ వేదికగా జరిగిన 2018 యుఎస్ ఓపెన్ మహిళల సింగిల్స్ ఫైనల్‌లో అమెరికా టెన్నిస్ స్టార్ సెరెనా విలియమ్స్‌ను ఓడించి విజేతగా నిలిచింది. తద్వారా యుఎస్ ఓపెన్ గెలిచిన జపనీస్ క్రీడాకారిణిగా ఒసాకా చరిత్ర సృష్టించింది.
జపాన్ పురుష ఆటగాళ్లు కూడా ఇప్పటివరకు ఈ ఘనత సాధించలేక పోవడం విశేషం. 20 ఏళ్ల నవోమీ ఒసాకా వరుస సెట్లలో సెరెనాను చిత్తు చేసి కెరీర్‌తో తొలి గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను ముద్దాడింది. టోర్నీ టైటిల్ విజేతగా నిలిచినందుకు ఒసాకా 3.8 మిలియన్ డాలర్ల ప్రైజ్ మనీని అందుకుంది.
ఒసాకా యుఎస్ ఓపెన్ టైటిల్‌ను నెగ్గడంతో అటు జపాన్ టెన్నిస్ అభిమానులు సైతం సంబరాలు చేసుకుంటున్నారు. జపాన్ టెన్నిస్ అభిమానులు సంబరాలు చేసుకుంటున్న వీడియోలను జపాన్ టైమ్ ప్రముఖంగా చూపించింది. ఒసాకాపై జపాన్ వ్యాప్తంగా ప్రశంసల వర్షం కురుస్తోంది.
టీవీల్లో సెరెనా, ఒసాకా మ్యాచ్‌ని వీక్షించిన వెస్ట్రన్ జపాన్‌కు చెందిన ఓ టీచర్ 20 ఏళ్ల ఒసాకాపై ప్రశంసల వర్షం కురిపించింది. ఫైనల్లో ఒసాకా అద్భుత ప్రదర్శన చేసిందని కొనియాడింది. ప్రస్తుతం మహిళల సింగిల్స్ ట్రోఫీతో ప్రచార కార్యక్రమాల్లో ఒసాకా సందడి సందడి చేస్తోంది. ఇందుకు సంబంధించిన ఫోటోలను ఒసాకా తన అధికారిక ట్విట్టర్‌లో అభిమానులతో పంచుకుంది.

యుఎస్ ఓపెన్ సింగిల్స్ ట్రోఫీతో ఒసాకా
యుఎస్ ఓపెన్ సింగిల్స్ ట్రోఫీతో జపనీస్ టెన్నిస్ స్టార్ నవోమీ ఒసాకా.

ప్రమోషనల్ ఈవెంట్‌లో ఒసాకా
ఓ ప్రచార కార్యక్రమంలో యుఎస్ ఓపెన్ సింగిల్స్ ట్రోఫీతో జపనీస్ టెన్నిస్ స్టార్ నవోమీ ఒసాకా.

జొకోవిచ్‌తో కలసి ఫోటోలకు ఫోజోలు
ఓ స్పోర్ట్స్ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూ సందర్భంగా యుఎస్ ఓపెన్ పురుషుల సింగిల్స్ విజేకా నొవాక్ కోవిచ్‌తో ఫోటోలకు ఫోజులిచ్చిన మహిళల సింగిల్స్ విన్నర్ నవోమీ ఒసాకా.

ట్రోఫీతో ఫోటోలకు ఫోజులు
ఓ ప్రమోషనల్ ఈవెంట్‌లో యుఎస్ ఓపెన్ మహిళల సింగిల్స్ ట్రోఫీతో ఫోటోలకు ఫోజులిచ్చిన జపనీస్ టెన్నిస్ స్టార్ నవోమీ ఒసాకా.

వరుస సెట్లలో సెరెనాను చిత్తు చేసిన ఒసాకా
20 ఏళ్ల నవోమీ ఒసాకా వరుస సెట్లలో సెరెనాను చిత్తు చేసి కెరీర్‌తో తొలి గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను ముద్దాడింది. టోర్నీ టైటిల్ విజేతగా నిలిచినందుకు ఒసాకా 3.8 మిలియన్ డాలర్ల ప్రైజ్ మనీని అందుకుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications