Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

యుఎస్ ఓపెన్‌: తొలిరోజే సంచనలం, తొలి రౌండ్లోనే ఓడిన హలెప్

US Open 2018: Halep crashes out as Venus, Serena and Stephens progress

హైదరాబాద్: యుఎస్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌లో తొలి రోజే పెను సంచలనం నమోదైంది. ప్రపంచ నంబర్‌వన్, టాప్‌ సీడ్‌ సిమోనా హలెప్‌ (రొమేనియా) తొలి రౌండ్లో షాక్‌ తగిలింది. సోమవారం జరిగిన మహిళల సింగిల్స్‌ తొలిరౌండ్‌లో ఫ్రెంచ్‌ ఓపెన్‌ చాంపియన్‌ హలెప్‌కు ఎస్తోనియా ప్లేయర్‌ కయి కనెపి షాకిచ్చింది.

వరుస సెట్లలో అన్‌సీడెడ్‌ కనెపి (ఎస్తోనియా) 6-2, 6-4తో హలెప్‌ను ఓడించింది. సోమవారం జరిగిన ఈ పోరులో హలెప్‌ను ఓడించేందుకు కనెపి పెద్దగా కష్టపడలేదు. కేవలం 76 నిమిషాల్లో ప్రత్యర్థి ఆటకట్టించింది. ఈ మ్యాచ్‌లో హలెప్‌ తన ప్రత్యర్ధికి ఏమాత్రం పోటీ ఇవ్వలేకపోయింది.

మ్యాచ్‌ మొత్తంమీద 9 విన్నర్లే కొట్టిన హలెప్‌ ఒక ఏస్‌ సంధించింది. మరోవైపు మ్యాచ్‌ ఆసాంతం దూకుడుగా ఆడిన కనెపి 26 విన్నర్లు కొట్టింది. 5 బ్రేక్‌ పాయింట్లను సాధించింది. యుఎస్‌ ఓపెన్‌ చరిత్రలో టాప్‌ సీడ్‌ క్రీడాకారిణి తొలి రౌండ్‌లోనే ఓడిపోవడం ఇదే తొలిసారి.

గతేడాది కూడా హలెప్‌ తొలి రౌండ్‌లోనే ఓడిపోయినా ఆమె రెండో సీడ్‌గా బరిలోకి దిగింది. ఇతర మహిళల సింగిల్స్‌ మ్యాచ్‌ల్లో ఏడో సీడ్‌ స్వితోలినా (ఉక్రెయిన్‌) శుభారంభం చేసింది. తొలి రౌండ్లో 6-3, 1-6, 6-1తో వికరి (అమెరికా)పై విజయం సాధించింది.

ఇతర మ్యాచ్‌ల్లో మెర్టెన్స్‌ (బెల్జియం) 6-2, 7-6 (7-5), 7-5తో నరా (జపాన్‌)పై, లాప్కో (బెలారస్‌) 6-3, 6-3తో బొండారెంకో (ఉక్రెయిన్‌)పై, బెగు (రొమేనియా) 6-3, 6-3తో బ్రాడీ (అమెరికా)పై, వాంగ్‌ (చైనా) 6-2, 6-2తో రిబరికోవా (స్లొవేకియా)పై, వానియా కింగ్‌ (అమెరికా) 7-6 (7-4), 6-3తో విక్లియాన్‌త్సెవా (రష్యా)పై గెలిచారు.

పురుషుల సింగిల్స్‌లో రోనిచ్‌ (కెనడా) శుభారంభం చేశాడు. మొదటి రౌండ్లో అతడు 7-6 (7-4), 6-4, 1-6, 6-3తో బెర్లోక్‌ (అర్జెంటీనా)పై నెగ్గాడు. సాక్‌ (అమెరికా), కచనోవ్‌ (రష్యా), పెలా (అర్జెంటీనా), గిల్లెస్‌ సిమోన్‌ (ఫ్రాన్స్‌) కూడా రెండో రౌండ్లో అడుగుపెట్టారు.

Story first published: Tuesday, August 28, 2018, 8:53 [IST]
Other articles published on Aug 28, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+