Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఇక నుంచి నో: మరియా షరపోవాకు మరో షాక్

లాస్ ఏంజిల్స్: డోపింగ్ టెస్టులో దొరికిన రష్యా టెన్నిస్ స్టార్ మరియా షరపోవాకు మరో షాక్ తగిలింది. డోపింగ్ కేసు వివాదం నేపథ్యంలో తమ గుడ్‌విల్ అంబాసిడర్‌గా ఉన్న మరియా షరపోవాను సస్పెండ్ చేసినట్లు ఐక్యరాజ్య సమితి తాజాగా ప్రకటించింది.

ప్రస్తుతం షరపోవా పైన ప్రపంచ టెన్నిస్ సమాఖ్య తాత్కాలిక సస్పెన్షన్ విధించింది. షరపోవై తాజా ప్రకటన నేపథ్యంలో గుడ్‌విల్ అంబాసిడర్‌గా ఆమె హోదాను సస్పెండ్ చేస్తున్నామని, ఈ వ్యవహారంలో దర్యాఫ్తు కొనసాగినంత కాలం ఆమెతో ఎలాంటి కార్యక్రమాలు చేపట్టబోమని న్యూయార్క్‌లోని ఐరాస అభివృద్ధి పథకం ఓ ప్రకటనలో తెలిపింది.

చెర్నాబిల్ అణు విపత్తు వ్యవహారంలో తమ సహాయ కార్యక్రమాలకు మద్దతు తెలిపినందుకు షరపోవాకు కృతజ్ఞతలు తెలిపింది. 2007 నుంచి పేదరికం, అసమానతల పైన పోరాడేందుకు ఐక్యరాజ్య సమితి అంబాసిడర్‌గా షరపోవా పని చేస్తోంది.

చెర్నాబిల్ విపత్తు సమయంలో ప్రభావిత ప్రజలకు ఎడ్యుకేషన్ స్కాలర్ షిప్‌లు అందించేందుకు అవసరమైన విరాళాలు సేకరించేందుకు యూఎస్డీపీతో కలిసి షరపోవా చారిటబుల్ ట్రస్ట్ కృషి చేస్తోంది.

United Nations agency stops work with ambassador Sharapova

కాగా, రష్యా స్టార్ టెన్నిస్‌ క్రీడాకారిణి, ఐదుసార్లు గ్రాండ్‌స్లామ్‌ విజేత మరియా షరపోవా కెరీర్‌ చిక్కుల్లో పడిన విషయం తెలిసిందే. తాను డోపింగ్‌ టెస్ట్‌లో దొరికిపోయినట్లు షరపోవా ఇటీవల స్వయంగా వెల్లడించింది.

జనవరిలో జరిగిన ఆస్ట్రేలియా ఓపెన్‌ సందర్భంగా నిర్వహించిన డ్రగ్‌ టెస్ట్‌లో తాను మెల్డోనియం డ్రగ్‌ తీసుకోవడంతో పాజిటివ్‌ అని వచ్చినట్లు తెలిపింది. అయితే ఈ డ్రగ్‌ తాను పదేళ్లుగా (2006 నుంచి) తీసుకుంటున్నానని, దానిని ఈ ఏడాదే నిషేధిత జాబితాలో చేర్చారని షరపోవా తెలిపింది.

డోపీగా తేలడంతో అంతర్జాతీయ టెన్నిస్‌ సమాఖ్య ఆమెను సస్పెండ్‌ చేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో మార్చి 12 నుంచి తాత్కాలిక సస్పెన్షన్‌ అమలులోకి రానుంది. ఈ పరిణామంతో ఆమె కెరీర్ ప్రశ్నార్థకంగా మారింది.

'నేను చాలా పెద్ద తప్పు చేశాను. డోపింగ్‌ టెస్ట్‌ విఫలమవ్వడంలో పూర్తి బాధ్యత నాదే. నా అభిమానులను బాధపెట్టాను, నాలుగేళ్ల వయస్సు నుంచి టెన్నిస్‌ ఆడుతున్నా. అందుకే టెన్నిస్‌ అంటే ఎంతో ప్రేమ' అని షరపోవా లాస్‌ఏంజిల్స్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో పేర్కొన్నారు.

Story first published: Tuesday, November 14, 2017, 10:15 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+