
హైదరాబాద్: ఏటీపీ వరల్డ్ టూర్ ఫైనల్స్ ట్రోఫీని బల్గేరియా స్టార్ ప్లేయర్ గ్రిగర్ దిమిత్రోవ్ సొంతం చేసుకున్నాడు. తొలిసారిగా ఈ టోర్నీకి అర్హత సాధించిన దిమిత్రోవ్ తనదైన ఆటతీరుతో ఏడో సీడ్ డేవిడ్ గాఫిన్‌పై అద్భుత ప్రదర్శన చేశాడు.
సుమారు రెండున్నర గంటలపాటు సాగిన ఉత్కంఠ పోరులో దిమిత్రోవ్ 7-5, 4-6, 6-3 తేడాతో గాఫిన్‌పై విజయం సాధించాడు. దీంతో దిమిత్రోవ్ అర్హత సాధించిన తొలి నిట్టో ఏటీపీ వరల్డ్ టూర్ ఫైనల్స్ టైటిల్‌ను గెలిచిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు.
1998లో అలెక్స్ కొరెట్జా తర్వాత ఈ ఘనత సాధించిన ఆటగాడిగా అరుదైన గుర్తింపు పొందాడు. మరోవైపు రన్నరప్ గాఫిన్ కూడా అర్హత సాధించిన తొలిసారే ఫైనల్‌కు చేరడం విశేషం. తాజా విజయంతో టెన్నిస్ ర్యాంకుల్లో దిమిత్రోవ్ మూడో ర్యాంకుకు చేరుకున్నాడు.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.