For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Tokyo Olympics 2021: లోక‌ల్ ప్లేయ‌ర్‌ ఔట్.. జపాన్ గోల్డ్ ఆశలు గల్లంతు!!

Tokyo Olympics 2021: Japan player Naomi Osaka crashes out of Round 3

టోక్యో: టెన్నిస్ మహిళల సింగిల్స్‌ విభాగంలో గోల్డ్ ఖాయం అనుకున్న ఆతిథ్య జపాన్‌కు భారీ షాక్ తగిలింది. రెండ‌వ‌ సీడ్, లోక‌ల్ ప్లేయ‌ర్‌ న‌వోమి ఒసాకా.. టోక్యో ఒలింపిక్స్ నుంచి నిష్క్రమించింది. మంగళవారం జరిగిన మహిళల సింగిల్స్‌ మూడో రౌండ్‌లో స్టార్ ప్లేయర్ ఒసాకా వ‌రుస సెట్ల‌లో ఓట‌మి పాలైంది. చెక్ రిప‌బ్లిక్ క్రీడాకారిణి మార్కెట వండ్రోసోవా చేతిలో 6-1, 6-4 స్కోర్ తేడాతో ఓడిపోయింది. దీంతో సొంత గడపై ఒలింపిక్ స్వర్ణం సాధించాలనే ఒసాకా కల నెరవేరకుండా పోయింది.

అరియేక్ టెన్నిస్ పార్క్‌లో మంగళవారం ఉదయం జ‌రిగిన ఈ మ్యాచ్‌లో జ‌పాన్ ప్లేయ‌ర్ న‌వోమి ఒసాకా ఆరంభం నుంచి త‌డ‌బ‌డింది. 68 నిమిషాల పాటు మ్యాచ్ సాగినా.. ఎక్కడా మార్కెట వండ్రోసోవాకు పోటీ ఇవ్వలేకపోయింది. తొలి గేమ్‌లో సర్వ్‌ను వదులుకోవడం ద్వారా వెనకపడిపోయిన ఒసాకా.. మళ్లీ పుంజుకోలేదు. దీంతో 2019 ఫ్రెంచ్ ఓపెన్ రన్నరప్ వండ్రోసోవా తొలి సెట్‌ను సునాయాసంగా గెలుచుకుంది. రెండవ సెట్లో ఒసాకా చెలరేగినా.. కీలక సమయంలో డబుల్ ఫాల్ట్‌తో మూల్యం చెల్లించుకుంది. నాలుగుసార్లు గ్రాండ్‌స్లామ్ విజేత అయిన ఒసాకా 32 అన‌వ‌స‌ర త‌ప్పిదాలు చేసింది.

ప్రపంచ నంబర్‌వన్‌ యాష్లే బార్టీకి టోక్యో ఒలింపిక్స్‌ 2021లో భారీ షాక్‌ తగిలిన విషయం తెలిసిందే. టెన్నిస్ మహిళల సింగిల్స్‌ విభాగంలో ప్రపంచ నంబర్ 48 సారా సోరిబ్స్‌ (స్పెయిన్‌)తో ఆదివారం జరిగిన లీగ్‌ మ్యాచ్‌లో బార్టీ 6-4, 6-3తో వరుస సెట్లలో ఓడిపోయింది. ఒక గంట 34 నిమిషాలు పాటు జరిగిన ఈ మ్యాచులో బార్టీ తన మార్క్ చూపించలేకపోయింది. ఇటీవల ముగిసిన వింబుల్డన్‌ 2021లో స్టార్ క్రీడాకారిణులు ఓడించి టైటిల్ నెగ్గిన బార్టీ.. ఒలింపిక్స్‌లో మాత్రం తన కన్నా చాలా తక్కువ రాంక్ ప్లేయర్ చేతిలో ఓడిపోవడం అందరిని ఆశ్చర్యపరుస్తోంది.

ఒలింపిక్స్‌ 2020లో స్వర్ణ పతకంపై గురి పెట్టిన సెర్బియా టెన్నిస్‌ స్టార్‌ నొవాక్‌ జొకోవిచ్‌ ఆ దిశగా మరో అడుగు వేశాడు. పురుషుల సింగిల్స్‌ విభాగంలో సోమవారం జరిగిన రెండో రౌండ్‌లో టాప్‌ సీడ్‌ జొకోవిచ్‌ 6-4, 6-3తో జాన్‌ లెనార్డ్‌ స్ట్రఫ్‌ (జర్మనీ)పై విజయం సాధించి మూడో రౌండ్‌లోకి ప్రవేశించాడు. 74 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో జకో 14 ఏస్‌లు సంధించాడు. ఈ ఏడాది మూడు గ్రాండ్‌స్లామ్‌ టైటిల్స్‌ (ఆస్ట్రేలియన్, ఫ్రెంచ్, వింబుల్డన్‌) టైటిల్స్‌ నెగ్గిన జకో.. ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధిస్తే 'గోల్డెన్‌ స్లామ్‌' ఘనతకు అవకాశం లభిస్తుంది. సెప్టెంబర్‌లో జరిగే యూఎస్‌ ఓపెన్‌లోనూ జొకోవిచ్‌ చాంపియన్‌గా నిలిస్తే.. పురుషుల టెన్నిస్‌ చరిత్రలో ఒకే ఏడాది నాలుగు గ్రాండ్‌స్లామ్‌ టైటిల్స్‌ నెగ్గిన ఏకైక ఆటగాడిగా నిలవనున్నాడు.

Story first published: Tuesday, July 27, 2021, 12:08 [IST]
Other articles published on Jul 27, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+