న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఇండియన్‌ వెల్స్‌: రోజర్ ఫెదరర్‌కు షాకిచ్చిన డొమినిక్‌ థీమ్‌

Thiem topples Federer for maiden Masters title; Messi magic hands Barca 4-1 victory

హైదరాబాద్: ఇండియన్‌ వెల్స్‌ మాస్టర్స్‌ టెన్నిస్‌ టోర్నమెంట్‌లో కొత్త ఛాంపియన్స్‌ అవతరించారు. పురుషుల సింగిల్స్‌లో ఏడో సీడ్‌ డొమినిక్‌ థీమ్‌ (ఆస్ట్రియా)... మహిళల సింగిల్స్‌లో 'వైల్డ్‌ కార్డు'తో బరిలోకి దిగిన బియాంక ఆండ్రీస్కు (కెనడా) కొత్త ఛాంపియన్స్‌గా అవతరించి సంచలనం సృష్టించారు.

అంబానీ మరో ఘనత: వరల్డ్ రిచెస్ట్ స్పోర్ట్స్ టీమ్ ఓనర్ల జాబితాలో అగ్రస్థానంఅంబానీ మరో ఘనత: వరల్డ్ రిచెస్ట్ స్పోర్ట్స్ టీమ్ ఓనర్ల జాబితాలో అగ్రస్థానం

రికార్డు స్థాయిలో ఆరోసారి ఏటీపీ ఇండియన్‌ వెల్స్‌ మాస్టర్స్‌ టైటిల్‌ గెలవాలన్న స్విట్జర్లాండ్‌ టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెదరర్ ఆశ నెరవేరలేదు. ఫైనల్లో ఫెదరర్ 6-3, 3-6, 5-7తో డొమినిక్‌ థీమ్‌ (ఆస్ట్రియా) చేతిలో పరాజయం పాలయ్యాడు. తాజా విజయంతో 22 ఏళ్ల తర్వాత మాస్టర్స్‌ సిరీస్‌ టైటిల్‌ నెగ్గిన ఆస్ట్రియా ప్లేయర్‌గా థీమ్‌ నిలిచాడు.

ఆస్ట్రియా తరఫున చివరిసారి థామస్‌ ముస్టర్‌ (1997లో మయామి ఓపెన్‌) మాస్టర్స్‌ సిరీస్‌ టైటిల్‌ గెలిచాడు. థీమ్‌కు ఇది కెరీర్‌లో 12వ టైటిల్‌. ఇక, మహిళల సింగిల్స్‌ ఫైనల్లో 18 ఏళ్ల బియాంక ఆండ్రీస్కు 6-4, 3-6, 6-4తో ప్రపంచ మాజీ నంబర్‌వన్‌ ఎంజెలిక్‌ కెర్బర్‌ (జర్మనీ)పై విజయం సాధించింది.

ఈ టోర్నీలో ఛాంపియన్స్‌గా నిలిచిన థీమ్, బియాంకాలకు 13,54,010 డాలర్ల (రూ. 9 కోట్ల 29 లక్షలు) చొప్పున ప్రైజ్‌మనీతోపాటు 1000 ర్యాంకింగ్‌ పాయింట్లు లభించాయి.

Story first published: Tuesday, March 19, 2019, 9:57 [IST]
Other articles published on Mar 19, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X