న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

త్వరలోనే రాకెట్ పడతా: కత్తి దాడికి గురైన క్విటోవా

గుర్తు తెలియని దుండగుడి చేతిలో కత్తి దాడికి గురైన చెక్‌ రిపబ్లిక్‌ టెన్నిస్‌ స్టార్‌ పెట్రా క్విటోవా ఆరు వారాలు ఆటకు దూరం కానుంది.

By Nageshwara Rao

హైదరాబాద్: గుర్తు తెలియని దుండగుడి చేతిలో కత్తి దాడికి గురైన చెక్‌ రిపబ్లిక్‌ టెన్నిస్‌ స్టార్‌ పెట్రా క్విటోవా ఆరు వారాలు ఆటకు దూరం కానుంది. నాలుగురోజుల క్రితం చెక్‌లోని తూర్పు ప్రాంతమైన ప్రొస్టెజోవ్ నగరంలోని తన ఇంటిలో దుండగుడి చేతిలో కత్తిపోటుకు గురై చికిత్స పొందుతున్న క్విటోవా శుక్రవారం మీడియా ముందుకు వచ్చింది.

<strong>షేక్ అయ్యా: టెన్నిస్ క్రీడాకారిణి క్విటోవాపై కత్తితో దాడి</strong>షేక్ అయ్యా: టెన్నిస్ క్రీడాకారిణి క్విటోవాపై కత్తితో దాడి

ఈ నేపథ్యంలో చేతికి కట్టుతోనే మీడియా సమావేశంలో పాల్గొన్న క్విటోవా త్వరలోనే మైదానంలోకి వచ్చి రాకెట్ పడతానని ఆశాభావం వ్యక్తం చేసింది. వైద్యులు కనీసం ఆరునెలలు ఆటకు దూరమవ్వాలని చెప్పారని తెలిపింది. సాధ్యమైనంతవరకు త్వరగా కోలుకొని రాకెట్ పడతానని ఆమె పేర్కొంది.

Tennis star Petra Kvitova vows to overcome knife attack

కాగా, క్విటోవా ఇంట్లో దోపిడి చేయడానికి వచ్చిన దుండగుడు అడ్డువచ్చిన క్విటోవాపై కత్తితో దాడి చేయడంతో ఆమె ఎడమచేతికి తీవ్ర గాయమైన సంగతి తెలిసిందే. ఈ దాడిలో ఆమె చేతి వేళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. శస్త్ర చికిత్స చేసిన వైద్యులు క్విటోవా రాకెట్‌ పట్టాలంటే కనీసం ఆరువారాల సమయం పడుతుందని వెల్లడించారు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసు ఉన్నతాధికారులు దర్యాప్తును ముమ్మరం చేశారు. 26 ఏళ్ల క్విటోవా 2011, 2014లో వింబుల్డన్ చాంపియన్‌గా నిలిచింది. ప్రస్తుతం వరల్డ్ ర్యాంకింగ్‌లో ఉన్న 11వ స్ధానంలో ఉన్న క్విటోవా తన కెరీర్‌లో 19 టైటిళ్లను సొంతం చేసుకుంది.

Story first published: Tuesday, November 14, 2017, 10:15 [IST]
Other articles published on Nov 14, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X