చీరలో ఇవనోవిచ్: అందానికి చీర కడితే ఇలాగే ఉంటుంది
న్యూఢిల్లీ: ఈ మధ్య కాలంలో అందం టెన్నిస్ క్రీడకు పర్యాయపదంగా మారింది. ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది టెన్నిస్ క్రీడాకారిణిలు తమ ఆటతో పాటు సొగసులతో ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేశారు. మరికొంత మంది ఇంకో అడుగు ముందుకేసి వ్యాపార ప్రకటనల్లో తమ సత్తా చాటారు.
దీనింతటిని చూసి ప్రపంచంలో అందమైన క్రీడ ఏదంటే టెన్నిస్ అనేంతగా మారిపోయింది. తన అద్భుతమైన ఆటతీరుతో ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న మాజీ నెంబర్ వన్ క్రీడాకారిణి అనా ఇవనోవిచ్ తొలిసారి భారతీయ వస్త్రధారణలో మురిసిపోయింది.

చీర కట్టుతో కనిపించి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. వచ్చే నెలలో సింగపూర్‌లో ప్రారంభమయ్యే ఇంటర్నేషనల్ ప్రీమియర్ టెన్నిస్ లీగ్ సీజన్-3లో అనా ఇవనోవిచ్ పాల్గొనడం దాదాపుగా ఖాయమైనట్టే. అయితే ఆమె 'ఇండియన్ ఏసెస్' తరఫున ఆడుతుందో లేదో అనే దానిపై స్పష్టత రాలేదు.
గతంలో సానియా మీర్జా, రద్వాంస్కా, బెర్నార్డ్ టామిక్, ఇవాన్ డోడిక్, రఫెల్ నాదల్, రోహన్ బోపన్న ఇండియన్ ఏసెస్ తరఫున ఆడారు. ఇవనోవిచ్ ఈ మధ్యే ముంబైలో సంప్రదాయ చీరకట్టులో మెరిసింది. చీరకట్టు ఆమె అందాన్ని మరింతగా ఇమడింపజేసింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications