Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

రాత్రికి రాత్రే గొప్ప క్రీడాకారులు కాలేరు: జీఈఎస్-2017లో సానియా

హైదరాబాద్: రాత్రికి రాత్రే ఎవరూ గొప్ప క్రీడాకారులు కాలేరని భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా స్పష్టం చేశారు. హైదరాబాద్ నగరంలోని హెచ్‌ఐసీసీలో నిర్వహిస్తున్న ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు(జీఈఎస్-2017)లో భాగంగా రెండో రోజు క్రీడా పరిశ్రమలో వ్యాపార విజయం అంశంపై చర్చ నిర్వహించారు.

ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సులో సానియా, మిథాలీ, గోపీచంద్

ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సులో సానియా, మిథాలీ, గోపీచంద్

ఈ చర్చలో టెన్నిస్‌ స్టార్ సానియా మీర్జా, బ్యాడ్మింటన్‌ కోచ్‌ పుల్లెల గోపీచంద్‌, క్రికెటర్‌ మిథాలీరాజ్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ చర్చకు ప్రముఖ క్రికెట్‌ వ్యాఖ్యాత హర్షాబోగ్లే వ్యవహరించారు. ఈ సందర్భంగా సానియా మిర్జా మాట్లాడుతూ కొత్త క్రీడాకారులకు మరిన్ని ప్రోత్సాహకాలు అవసరమని అన్నారు.

నిరంతర శ్రమ, పట్టుదలతోనే విజయాలు సాధ్యం

నిరంతర శ్రమ, పట్టుదలతోనే విజయాలు సాధ్యం

నిరంతర శ్రమ, పట్టుదలతోనే విజయాలు సాధ్యమవుతాయని సానియా మిర్జా చెప్పారు. అన్ని క్రీడల్లోనూ మహిళలు రాణిస్తున్నారన్న విషయాన్ని ఈ సందర్భంగా ఆమె గుర్తు చేశారు. బాలీవుడ్ నటుల ప్రచారంతో క్రీడలు ప్రాచుర్యం పెరుగుతుందన్న వాదనను అంగీకరించనను అని సానియా పేర్కొంది. బాక్సర్ మేరీకోమ్ ఒలింపిక్‌లో పథకం సాధించకముందు ఎంతమందికి తెలుసు? అని సానియా సూటిగా ప్రశ్నించారు.

క్రీడారంగంలో సౌకర్యాలు మెరుగుపరచాలి

క్రీడారంగంలో సౌకర్యాలు మెరుగుపరచాలి

ఇక, భారత మహిళా జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ మాట్లాడుతూ క్రీడారంగంలో సౌకర్యాలు మెరుగుపరచాలని కోరారు. గ్రామీణ ప్రాంతాల్లో చాలా మంచి క్రీడా నైపుణ్యాలు ఉన్న వారున్నారని తెలిపారు. అలాంటి వారు వసతులు, ఆర్థిక లేమితో అక్కడే ఉండిపోతున్నారని ఆమె అన్నారు. ఆర్థికంగా బాగా ఉన్న వారే క్రీడలవైపు వస్తున్నారని మిథాలీ పేర్కొన్నారు.

టెన్నిస్, రెజ్లింగ్, బ్యాటింగ్ ఇలా అన్ని క్రీడల్లో రాణిస్తున్నారు

టెన్నిస్, రెజ్లింగ్, బ్యాటింగ్ ఇలా అన్ని క్రీడల్లో రాణిస్తున్నారు

భారత బ్యాట్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ మాట్లాడుతూ క్రీడల్లో రాణించాలంటే పట్టుదల, కృషి అవసరమని అన్నారు. భారత్‌లో క్రీడాకారులు క్రికెట్ నుంచి అన్ని ఆటల వైపు మొగ్గు చూపుతున్నారని అన్నారు. టెన్నిస్, రెజ్లింగ్, బ్యాటింగ్ ఇలా అన్ని క్రీడల్లో రాణిస్తున్నారని తెలిపారు. సీడబ్ల్యూజీ, ఏషియన్ క్రీడల తర్వాత బ్యాడ్మింటన్ వైపు దృష్టి సారించారని గోపీచంద్ చెప్పారు.

Story first published: Wednesday, November 29, 2017, 13:58 [IST]
Other articles published on Nov 29, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+