జ‌కోవిచ్‌కు చేదు అనుభ‌వం! వీసా ర‌ద్దు.. ఎయిర్‌పోర్టులోనే నిలిపివేత‌

ఆస్ట్రేలియా: టెన్నిస్ దిగ్గ‌జం నొవాక్ జ‌కోవిచ్‌కు చేదు అనుభ‌వం ఎదురైంది. ఆస్ట్రేలియ‌న్ ఓపెన్‌లో పాల్గొనడానికి మెల్‌బోర్న్‌లో అడుగు పెట్టిన ఈ సెర్బియా స్టార్‌ను విమానాశ్ర‌యంలోనే నిలిపివేశారు. క‌రోనా వ్యాక్సిన్ వేసుకోకపోవ‌డానికి గ‌ల స‌రైన కార‌ణాలు చూపించ‌లేద‌నే కార‌ణంతో అధికారులు జ‌కో వీసాను కూడా ర‌ద్దు చేశారు. దీంతో వ‌రల్డ్ నంబ‌ర్ వ‌న్ ర్యాంక‌ర్‌ జ‌కోవిచ్ 8 గంట‌ల‌పాటు విమానాశ్ర‌యంలోనే ఉండిపోవాల్సి వ‌చ్చింది. కాగా జ‌కోవిచ్ గ‌త నెల‌లో క‌రోనా బారిన ప‌డిన సంగ‌తి తెలిసిందే.

 సెర్బియా అధ్య‌క్షుడు సీరియ‌స్

సెర్బియా అధ్య‌క్షుడు సీరియ‌స్

ఈ విష‌యం తెలిసిన సెర్బియా అధ్యక్షుడు అలెక్సాండ‌ర్ వ్యూహిక్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ప్ర‌పంచంలోనే అత్యుత్త‌మ ఆట‌గాడైన జ‌కోవిచ్‌తో ఇలాగేనా వ్య‌వ‌హ‌రించేద‌ని ప్ర‌శ్నించారు. అయితే తాను జ‌కోవిచ్‌తో మాట్లాడిన‌ట్టు ఆయన తెలిపారు. అలాగే త‌మ దేశం మొత్తం జ‌కోవిచ్‌కు అండ‌గా ఉంటుంద‌ని అలెక్సాండ‌ర్ చెప్పారు.

 స‌రైన కార‌ణం చెప్పాల్సిందేనన్న ఆస్ట్రేలియా ప్ర‌ధాని

స‌రైన కార‌ణం చెప్పాల్సిందేనన్న ఆస్ట్రేలియా ప్ర‌ధాని

కాగా ఈ ఉదంతంపై ఆస్ట్రేలియా ప్ర‌ధాని స్కాట్ మారిస‌న్ కూడా స్పందించారు. త‌మ దేశంలోకి ఎవ‌రు అడుగుపెట్టినా క‌చ్చితంగా క‌రోనా నిబంధ‌న‌లు పాటించాల్సిందేన‌ని తేల్చి చెప్పారు. ఏ వ్య‌క్తికైనా ఒకే నిబంధ‌న‌లు ఉంటాయ‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. అలాగే జ‌కోవిచ్ టీకా తీసుకోక‌పోవ‌డానికి గ‌ల స‌రైన కార‌ణాల‌ను వెల్ల‌డిస్తేనే ఆస్ట్రేలియ‌న్ ఓపెన్ ఆడ‌నిస్తామని తెలిపారు. వీసా తిరిగి పున‌రుద్ధరింప చేస్తామని చెప్పారు. లేదంటే తిరుగు ప‌య‌నం కావాల్సిందేన‌ని హెచ్చ‌రించారు.

వ్యాక్సిన్ వేసుకోని జ‌కోవిచ్

వ్యాక్సిన్ వేసుకోని జ‌కోవిచ్

క‌రోనా వ్యాక్సినేష‌న్‌కు తాను వ్య‌తిరేక‌మ‌ని ప్ర‌క‌టించ‌డ‌మే కాకుండా జ‌కోవిచ్ ఇప్ప‌టివ‌ర‌కు వ్యాక్సిన్ వేసుకోని సంగ‌తి తెలిసిందే. అయితే జ‌కోవిచ్ ఈ ఆస్ట్రేలియ‌న్ ఓపెన్‌లో ఆడేది లేనిది నేడు తెలిసే అవ‌కాశం ఉంది. కాగా డిఫెండింగ్ ఛాంపియ‌న్ అయినా నోవాక్ జ‌కోవిచ్ త‌న కెరీర్‌లో అత్య‌ధికంగా ఆస్ట్రేలియ‌న్ ఓపెన్‌ను 9 సార్లు గెలుచుకున్నాడు.

కొంపముంచిన ఎగ్జిబిషన్ మ్యాచ్‌.. టెన్నిస్ స్టార్ Novak Djokovic కు Corona!
రికార్డుపై జ‌కోవిచ్ గురి

రికార్డుపై జ‌కోవిచ్ గురి

త‌న కెరీర్‌లో ఇప్ప‌టివ‌ర‌కు 20 గ్రాండ్ స్లామ్‌లు గెలుచుకున్న జ‌కోవిచ్ టెన్నిస్‌లో అత్య‌ధిక గ్రాండ్ స్లామ్‌లు గెలిచిన దిగ్గ‌జ ఆట‌గాడు రోజ‌ర్ ఫెద‌ర‌ర్ స‌ర‌స‌న చేరాడు. దీంతో ఇంకొక గ్రాండ్ స్లామ్ గెలిస్తే అత్య‌ధిక గ్రాండ్ స్లామ్‌లు గెలిచిన ఆట‌గాడిగా టెన్నిస్ చ‌రిత్ర‌లో నిలిచిపోతాడు. ఆ రికార్డుపై ఆస్ట్రేలియ‌న్ ఓపెన్‌లోనే జ‌కోవిచ్ గురి పెట్టాడు. అయితే తాజాగా క‌రోనా వ్యాక్సిన్ వేసుకోని కార‌ణంగా జ‌కోవిచ్ ఆడ‌డంపై అనుమానాలు నెల‌కొన్నాయి. త‌న కెరీర్‌లో ఆస్ట్రేలియ‌న్ ఓపెన్‌ను జ‌కోవిచ్ అత్య‌ధికంగా 9 సార్లు గెలిచాడు. ఆ త‌ర్వాత వింబుల్డ‌న్‌ను 6 సార్లు, యూఎస్ ఓపెన్‌ను 3 సార్లు, ఫ్రెంచ్ ఓపెన్‌ను రెండు సార్లు గెలిచాడు.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Thursday, January 6, 2022, 10:05 [IST]
Other articles published on Jan 6, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X