Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

మళ్లీ కోర్టులోకి జొకోవిచ్: ఒక్క రోజు జరిగే టోర్నీలో కూడా

Tennis: Novak Djokovic gears up for Australian Open with Melbourne tournament

హైదరాబాద్: సెర్బియా టెన్నిస్ దిగ్గజం, పన్నెండు గ్రాండ్‌స్లామ్‌ టైటిళ్ల విజేత నొవాక్‌ జొకోవిచ్‌ మళ్లీ రాకెట్ పట్టనున్నాడు. మోచేతి గాయం కారణంగా ఐదు నెలలు ఆటకు దూరమైన జొకొవిచ్ ఈనెల చివర్లో దుబాయ్‌లో జరిగే ఎగ్జిబిషన్‌ మ్యాచ్‌తో పునరాగమనం చేయనున్నాడు.

అంతేకాదు వచ్చే ఏడాది జరిగే తొలి గ్రాండ్ స్లామ్ టోర్నీ ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో కూడా జొకొవిచ్ బరిలోకి దిగనున్నాడు. ఇప్పటివరకు జొకోవిచ్‌ ఆరు ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిళ్లను గెలిచాడు. దీంతో ఏడో ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌పై కన్నేశాడు. ఇదిలా ఉంటే జనవరి 10న మెల్‌బోర్న్‌లో జరిగే టైబ్రేక్‌ టెన్స్‌ టోర్నీలో కూడా ఆడనున్నాడు.

ఈ వినూత్న టోర్నీకి మెల్‌బోర్న్‌ పార్క్‌లోని మార్గరెట్‌ కోర్ట్‌ ఎరీనా వేదిక కానుంది. ఈ టోర్నీలో మాజీ వరల్డ్‌ నెంబర్‌వన్‌ జొకోవిచ్‌తో పాటు ఆస్ట్రేలియాకు చెందిన నిక్‌ కిర్గియోస్‌ సహా 8మంది ఆటగాళ్లు తలపడతారు. ఈ టోర్నీ ఒకే రోజులో ముగుస్తుంది.

ఈ టోర్నీలో జరిగే మ్యాచ్‌ల్లో మూడు సెట్లు గెలవాల్సిన పనిలేదు. ఒక్కో మ్యాచ్‌ ఒకో టైబ్రేకర్‌పాటు సాగుతుంది. దీంతో కేవలం ఓ టైబ్రేక్‌ గెలిస్తే చాలు. టైబ్రేక్‌లో తొలుత 10 పాయింట్లు సాధించిన ఆటగాడికి విజయం సొంతమవుతుంది. ఒక్క రాత్రిలో ముగిసే ఈ టోర్నీ విజేత ఏకంగా రూ.కోటి 60 లక్షలు అందుకుంటాడు.

లండన్‌, వియన్నా, మాడ్రిడ్‌లలో టెన్స్‌ టోర్నమెంట్‌ ఇప్పటికే జరగ్గా.. ఆస్ట్రేలియా ఈ తరహా టోర్నీని మొదటిసారి నిర్వహిస్తున్నారు. మరోవైపు జనవరి 15న ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ ప్రారంభమవుతుంది.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Thursday, December 21, 2017, 10:46 [IST]
Other articles published on Dec 21, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+