డల్లాస్: తెలుగు వారి మధ్య సుహృద్భావం, ఆరోగ్యం ప్రధాన లక్ష్యాలుగా ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం (టాంటెక్స్), జాతీయ తెలుగు సంస్థ ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్) సంయుక్త సహకారంతో టెన్నిస్ఆటల పోటీలను నిర్వహించారు. ఈ పోటీలు డల్లాస్ ఫొర్ట్ వర్త్ మహానగర ప్రాంతంలోని కొపెల్నగరంలో "వాగన్ వీల్" టెన్నిస్ సెంటర్ లొ క్రీడాకారులు, టాంటెక్స్, నాట్స్ ప్రతినిధుల సమక్షంలొ మొదలయింది.
ఈ పోటీలలో రికార్డు స్థాయిలో 32 జంటలు పాల్గొన్నాయి. అమెరికన్ కానఫరెన్స్, ఇండియన్ కానఫరెన్స్ విభాగాల్లో మొత్తము 63 మ్యాచులతో చాంపియన్ షిప్ నిర్వహించారు. టాంటెక్స్ ఉత్తరాధ్యక్షులు ఊరిమిండి నరసింహారెడ్డి మాట్లాడుతూ - ఈ పొటీలు తెలుగు వారి స్నేహానికి, సుహృధ్బావానికి, ఐకమత్యానికి ప్రతీక అన్నారు. పొటీలలో పాల్గొన్న క్రీడాకారులకు ధన్యవాదాలు తెలియజేస్తూ, సంస్థ కార్యకలాపాలలో భాగస్వామ్యంకావడము గొప్ప విషయమని, మన తెలుగు వారిని ఇంకా ఎంతో ప్రోత్సహించాలని కోరారు.

నాట్స్ కోఅర్దినేటర్ బాపు నూతి మాట్లాడుతూ - ఈ ఆటకు ఎల్లప్పుడూ సహాయ సహకారాలూ అందిస్తూ మన తెలుగు వారి అభ్యున్నతికి కృషి చేస్తూ ఉంటామన్నారు. యువత, మహిళలు ఎక్కువ మంది పాల్గొనడము ఎంతో అనందంగా ఉందన్నారు. టాంటెక్స్ మరియు నాట్స్ కార్యవర్గ సభ్యులు వెంకట్ దండ, రాజేంద్ర మాదాల, మహేష్ ఆదిభట్ల, మురళి కొండెపాటి, రామ కృష్ణారెడ్డి రొడ్డ, అరవింద్ ఇంజా, శ్రీధర్ బెండపూడి నిర్ధిష్టమైన ప్రణాళికతో టెన్నిస్ ఆటల పోటీలు సక్రమంగా జరగడానికి ఎంతో కృషి చేశారు.
బాల్కి చామకూర, వేణు పావులూరి, రాజు కుర్కూరి మరియు శారద సింగిరెడ్డి సహాయ సహకారాలు అందించారు. విలియం డొల్ల, హాన్స్ మనోహర్ వల్లపర్ల ప్రథమ స్థానంలో, రాజా కంచి, అబ్రహం సైమన్ ద్వితీయ స్థానంలో నిలిచారు. టాంటెక్స్ క్రీడల సమన్వయకర్త వెంకట్దండ, నాట్స్ క్రీడల ప్రతినిధి రాజేంద్ర మాదాల న్యాయనిర్ణేతలకు, స్వచ్చంద కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు.