Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఏడ్చాను, నోట మాట రాలేదు: ఆ ఓటమిపై సానియా

హైదరాబాద్: రియో ఒలింపిక్స్‌లో కాంస్య పతక పోరులో ఓటమి పాలవ్వడం తనను తీవ్రంగా బాధించిందని టెన్నిస్ స్టార్ సానియా మిర్జా తెలిపింది. జాతీయ న్యూస్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్యూలో సానియా మిర్జా మ్యాచ్ అనంతరం తాను భోరున విలపించానని చెప్పుకొచ్చింది.

'ఈ ఏడాది నన్ను తీవ్రంగా కలచివేసిన సంఘటన ఏదైనా ఉందంటే అది రియో ఒలింపిక్స్‌లో ఓటమే. చాలా కాలం తర్వాత నేను ఏడ్చాను. మీడియా సమావేశంలో దుఃఖాన్ని ఆపుకోలేకపోయాను. మామూలు టోర్నీలో అరుుతే ఓటమి అంతగా బాధించదు. వచ్చే టోర్నీలో చూసుకుందాంలే అని అనిపిస్తుంది' అని సానియా తెలిపింది.

'ఒలింపిక్స్‌ తొలి రౌండ్లో ఓడిపోయి ఉంటే నేను పెద్దగా బాధపడేదాన్ని కాదు. కానీ పతకానికి అత్యంత చేరువగా వచ్చి ఓడిపోవడంతో గుండె పగిలినట్లయింది. నాలుగో స్థానంతో ఒలింపిక్స్‌ ముగించడం గొప్ప ఘనతే. కానీ లక్ష్యాన్ని చేరలేకపోయాం. పతక పోరు ముగిసిన రెండు గంటల్లోనే నేను, బోపన్న సిన్సినాటి టోర్నీకి బయల్దేరాం' అని పేర్కొంది.

'ఒలింపిక్ క్రీడా గ్రామం నుంచి విమానాశ్రయానికి వెళ్లడానికి గంటా 15 నిమిషాలు పట్టింది. ఆ సమయంలో మేం ఒకటి రెండు మాటలు తప్ప ఏం మాట్లాడలేదు. ఇద్దరం అంత బాధను అనుభవించాం. నేను నా మొబైల్‌ కూడా స్విచాఫ్‌ చేసేశా. ఎందుకంటే ఒలింపిక్స్ కోసం మరో నాలుగేళ్ల పాటు నిరీక్షణ తప్పదు. అప్పటికి కూడా మరోసారి ఆడతామో? లేదో? గ్యారంటీ ఉండదు' అని సానియా ఆవేదనతో చెప్పింది.

 టెన్నిస్ ఆటగాళ్లు కూడా భావోద్వేగాలకు గురవుతారు

టెన్నిస్ ఆటగాళ్లు కూడా భావోద్వేగాలకు గురవుతారు

'టెన్నిస్ ఆటగాళ్లు అలాంటి చోట చాలా భావోద్వేగాలకు గురవుతారు. ఆ తర్వాత వెంటనే సిన్సినాటి టోర్నీలో ఆడి టైటిల్ గెలిచాను' అని సానియా ఈ సందర్బంగా గుర్తుచేసింది. ఇక 2020లో జరిగే టోక్యో ఒలింపిక్స్‌లో తాను పాల్గొనే దానిపై కాస్తంత అనుమానంగానే సానియా తేల్చి చెప్పింది.

 టోక్యో ఒలింపిక్స్‌కు శరీరం సహకరించ పోవచ్చు

టోక్యో ఒలింపిక్స్‌కు శరీరం సహకరించ పోవచ్చు

అప్పటికి తన శరీరం సహకరించే స్థితిలో ఉండకపోవచ్చని, ఒకవేళ టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొన్నా పతకం సాధించే స్థాయిలో ఆడలేక పోవచ్చని సానియా మిర్జా చెప్పింది. అయితే ప్రస్తుత సమాజంలో మహిళలకు సమానత్వం లేకుండా పోయిందని అభిప్రాయపడింది. తాను ఇన్నాళ్లు సాధించిన విజయాల గురించి కాకుండా ‘తల్లి కాబోయేది ఎప్పుడనే ప్రశ్న' ఎక్కువ సార్లు వినిపిస్తూ ఉంటుందని తెలిపింది.

 గ్రాండ్‌స్లామ్స్ గెలవడంపై దృష్టి సారిస్తా

గ్రాండ్‌స్లామ్స్ గెలవడంపై దృష్టి సారిస్తా

2016 లాగే వచ్చే సీజన్‌లో కూడా మరిన్ని గ్రాండ్‌స్లామ్స్ గెలవడంపై దృష్టి సారిస్తానని సానియా పేర్కొంది. ‘2016 నాకు అద్భుతంగా గడిచింది. ఎందుకంటే నా ఆటతీరుతో గ్రాండ్‌స్లామ్ సహా ఎనిమిది టైటిళ్లు గెలిచాను. ఫ్రెంచ్ ఓపెన్ మిక్స్‌డ్ డబుల్స్‌లో ఫైనల్‌కు వెళ్లాను. వచ్చే ఏడాదికి ఎలాంటి లక్ష్యాలు నిర్దేశించుకోలేదు' అని సానియా చెప్పింది.

హింగిస్‌తో విడిపోతానని ఊహించలేదు

హింగిస్‌తో విడిపోతానని ఊహించలేదు

"మరిన్ని గ్రాండ్‌స్లామ్స్ గెలుస్తా అనే నమ్మకంతో ఉన్నా. ర్యాంకింగ్‌పై మాత్రం దృష్టి పెట్టలేదు. నిజానికి హింగిస్‌తో విడిపోతానని ఊహించలేదు. అది పూర్తిగా ప్రొఫెషనల్ నిర్ణయం. ఎవరైనా గెలవాలనే కోరుకుంటారు. అది జరగనప్పుడు తప్పుకోవడమే ఉత్తమం. మేమిద్దరం విడిపోయాక ఐదింటిలో మూడు టైటిళ్లు గెలిచాను. నంబర్‌వన్‌గానే ఉన్నాను' అని సానియా పేర్కొంది.

Story first published: Tuesday, November 14, 2017, 10:15 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+