జాతీయ క్రీడలు: టెన్నిస్‌లో సత్తా చాటిన తెలంగాణ.. ఆర్చరీలో ఏపి
తిరువనంతపురం: తెలుగు రాష్ట్రాలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తిరువనంతపురంలో జరుగుతున్న 35వ జాతీయ క్రీడల్లో ఆదివారం స్వర్ణ పతకాలు కైవసం చేసుకున్నాయి. టెన్నిస్‌లో తెలంగాణ ఆధిక్యాన్ని ప్రదర్శించగా, ఆర్చరీలో ఆంధ్ర రాణించింది.
సాకేత్ మైనేనీ, విష్ణువర్ధన్ జోడీ పురుషుల టెన్నిస్ డబుల్స్ విభాగంలో స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. అదే విధంగా టీం ఈవెంట్‌లో సాకేత్, విష్ణువర్ధన్, అబ్దుల్లా షేక్, వినయ్ శర్మ సభ్యులుగా ఉన్న తెలంగాణ జట్టు టీం ఈవెంట్‌లో రజత పతకాన్ని గెలుచుకుంది.

పురుషుల కాంపౌండ్ ఇండివిజువల్ విభాగంలో ఇసయ్య రాజేందర్ సనమ్ కాంస్య పతకాన్ని సాధించాడు. టీం ఈవెంట్‌లో కూడా తెలంగాణ జట్టుకు కాంస్యం దక్కింది. ఇప్పటిదాకా తెలంగాణకు 4 స్వర్ణాలు, 7 రజతాలు, 4 కాంస్యాలతో మొత్తం 15 పతకాలు లభించాయి.
ఆర్చరీ మహిళల కాంపౌండ్ ఇండివిజువల్ ఈ వెంట్‌లో పూర్వాషా సుధీర్ షిండే స్వర్ణ పతకాన్ని సాధించింది. మహిళల కాంపౌండ్ టీం ఈవెంట్ లో ఆంధ్ర జట్టు కాంస్యాన్ని అందుకుంది.ఏపీ మరో రెండుపతకాలు సాధించి మొత్తం 14 (5 స్వర్ణాలు, 3 రజతాలు, 6 కాంస్యాలు) పతకాలతో ఉంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications