Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

టాటా ఓపెన్ మహారాష్ట్ర: రామ్‌కుమార్ రామనాథన్ శుభారంభం

Tata Open Maharashtra: Ramkumar sets up 2nd round clash with world No. 6 Marin Cilic

హైదరాబాద్: టాటా ఓపెన్‌ మహారాష్ట్ర ఏటీపీ టెన్నిస్‌ టోర్నమెంట్‌లో భారత టెన్నిస్ ఆటగాడు రామ్‌కుమార్ రామనాథన్ శుభారంభం చేశాడు. ప్రస్తుతం 148వ ర్యాంకులో ఉన్న రామ్‌కుమార్‌ సోమవారం రాత్రి జరిగిన తొలి రౌండ్‌లో 7-6 (7/4), 6-2తో తనకంటే మెరుగైన ర్యాంకులో ఉన్న కార్బలెస్‌ బయెనా (స్పెయిన్‌)పై నెగ్గాడు.

మంగళవారం జరిగే రెండో రౌండ్‌లో ప్రపంచ ఆరో ర్యాంకర్, టోర్నీ ఫేవరెట్‌‌గా బరిలోకి దిగిన మారిన్‌ సిలిచ్‌ (క్రొయేషియా)తో రామ్‌కుమార్‌ తలపడనున్నాడు. గతేడాది జరిగిన వింబుల్డన్ ఛాంపియన్ షిప్స్‌లో రోజర్ ఫెదరర్ చేతిలో రామ్‌కుమార్ ఓటమి పాలై రన్నరప్‌గా నిలిచిన సంగతి తెలిసిందే.

రామ్ కుమార్‌తో జరిగే మ్యాచ్‌లో సిలిచ్ ఫేవరేట్ ప్లేయర్‌గా బరిలోకి దిగుతున్నాడు. ఈ సందర్భంగా రామ్ కుమార్ మాట్లాడుతూ 'సిలిచ్ అంటే ఎంతో గౌరవం. ప్రత్యర్ధి ఎవరైనా సరే నా అత్యుత్తమ ఆటతీరుని కనబరుస్తా. స్వదేశంలో అభిమానుల మధ్య మంచి ప్రదర్శన చేస్తా. ఏం జరుగుతుందో జరగనివ్వండి. ఆరంభం నుంచి చివరి వరకు మంచి ప్రదర్శన చేస్తా' అని అన్నాడు.

ఇదిలా ఉంటే డబుల్స్‌లో హైదరాబాద్‌ ఆటగాడు విష్ణువర్ధన్‌ జోడీకి తొలిరౌండ్లోనే చుక్కెదురైంది. వైల్డ్‌కార్డ్‌ ఎంట్రీ పొందిన విష్ణువర్ధన్‌-శ్రీరామ్‌ బాలాజీల జోడీ 6-3, 6-7 (6/8), 6-10తో అదిల్‌ షమస్దిన్‌ (కెనడా)-నీల్‌ స్కప్‌స్కీ (అమెరికా) జోడీ చేతిలో ఓటమి పాలైంది.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Tuesday, January 2, 2018, 16:09 [IST]
Other articles published on Jan 2, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+