సౌత్ ఆస్ట్రేలియా ఓపెన్ టైటిల్ గెలిచిన హరీందర్ పాల్ సంధు
హైదరాబాద్: భారత్‌కు చెందిన స్క్వాష్ క్రీడాకారుడు హరీందర్ పాల్ సంధు సౌత్ ఆస్ట్రేలియా ఓపెన్ టైటిల్ నెగ్గాడు. టోర్నీలో భాగంగా శనివారం నిర్వహించిన ఫైనల్లో ఆస్ట్రేలియా క్రీడాకారుడు రిస్ డౌలింగ్‌పై 11-8, 12-10, 11-4తేడాతో హరీందర్ విజయం సాధించాడు.
ఫస్ట్ గేమ్‌లో ఒకానొక దశలో 1-7తో వెనుకబడి ఉన్న హరీందర్ ఆ తర్వాత పుంజుకుని 11-8తో రిస్ డౌలింగ్‌పై విజయం సాధించాడు. హోరా హోరీగా జరిగిన రెండో గేమ్‌ని 12-10తో గెలుచుకున్న హరీందర్ మూడో గేమ్‌లో అద్భుత ప్రదర్శన చేశాడు.

ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా 11-4తో మూడో గేమ్‌ని సొంతం చేసుకుని సౌత్ ఆస్ట్రేలియా ఓపెన్ విజేతగా నిలిచాడు. మ్యాచ్ అనంతరం హరీందర్ మీడియాతో మాట్లాడాడు. చల్లని వాతావరణ పరిస్థితుల మధ్య ఆడటంతో ఈ వారం చాలా కష్టంగా గడిచిందని చెప్పాడు.
గతంలోనూ ఎన్నోసార్లు ఆస్ట్రేలియాలో టోర్నమెంట్లు ఆడినప్పటికీ, మొదటిసారి ఇక్కడ పీఎస్‌ఏ టోర్నమెంట్ గెలవడం సంతోషంగా ఉందని పేర్కొన్నాడు. మొత్తంగా హరీందర్‌కి ఇది 8వ పీఎస్‌ఏ టైటిల్ కాగా ఈ సీజన్‌లో ఇది మూడోది. మేలో మలేసియాలో రెండు టైటిళ్లు కైవసం చేసుకున్నాడు.
అంతకముందు ఏప్రిల్ నెలలో చెన్నైలో జరిగిన ఆసియా స్క్వాష్ ఛాంపియన్ షిప్‌లో క్వార్టర్ ఫైనల్స్‌కు చేరుకున్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications