ఆసుపత్రి నుంచి సానియా డిశ్చార్జ్, ఫోటోలు వైరల్: కొడుకు పేరేంటో తెలుసా?

హైదరాబాద్: భారత టెన్నిస్ స్టార్ సానియా మార్జా అక్టోబర్ 30న పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. దీంతో షోయబ్ మాలిక్-సానియా మిర్జాలు తల్లిదండ్రులుగా ప్రమోషన్ పొందారు. తాజాగా ఆ బిడ్డకు సానియా మిర్జా నామకరణం చేశారు. ఇంతకీ ఏం పేరు పెట్టారో తెలుసా?
‘ఇజ్‌హాన్' అని పేరు పెట్టిన సానియా మిర్జా
సానియా-షోయబ్‌ల బిడ్డకు ‘ఇజ్‌హాన్' అని పేరు పెట్టారు. అరబిక్‌లో ‘దేవుని బహుమతి', ‘విశ్వమంత ప్రేమ' అనే అర్థాలు వచ్చేలా కొడుక్కి పేరు పెట్టారు. తాజాగా ఆసుపత్రి నుంచి సానియా మీర్జా డిశ్చార్జి అయిన సమయంలో తీసిన ఫోటోలు బయటికి వచ్చాయి. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

షోయబ్ మాలిక్ ఆనందం
ఈ ఏడాది ఏప్రిల్ 23, 2018న తాను గర్భవతిననే విషయాన్ని సానియా మిర్జా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మంగళవారం ఉదయం సానియా పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. ఈ సందర్భంగా ఆమె భర్త షోయబ్ మాలిక్ ఆనందాన్ని వ్యక్తపరుస్తూ సోషల్ మీడియా వేదికగా తెలియజేశాడు.

నా శ్రీమతి ఎప్పటిలాగానే చాలా స్ట్రాంగ్‌గా
'ఈ శుభవార్తను మీతో పంచుకోవడం ఎంతో ఉద్వేగభరితంగా ఉంది. మగబిడ్డ.. నా శ్రీమతి ఎప్పటిలాగానే చాలా స్ట్రాంగ్‌గా ఉంది. మీ ప్రేమాభిమానాలు, ఆశీర్వాదాలకు కృతఙ్ఞతలు' అంటూ ట్వీట్ చేశాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications