
ఎంతో మంది క్రీడాకారిణులు ఎన్ని విజయాలు సాధించినా... ఈ తరహా తీరుతో స్పోర్ట్స్‌ను కెరీర్‌గా ఎంచుకునేందుకు అమ్మాయిలు భయపడతారని నాకనిపిస్తోంది' అని జ్వాల వ్యాఖ్యానించింది. ఒలింపిక్స్‌కు జట్లను ఎంపిక చేసే ముందు ఏఐటీఏ సానియాను కూడా సంప్రదించి ఉండాల్సిందని నా అభిప్రాయం అని అన్నారు. ఈ మొత్తం వ్యవహారం తనను షాక్‌కు గురి చేసిందని, దీని వల్ల ఆటకే కాకుండా, వ్యవస్దకే చెడ్డ పేరు తెచ్చే విధంగా ఉందని తెలిపింది.
లండన్ ఒలంపిక్స్‌లో ఆడేందుకు వైల్డ్ కార్డు ద్వారా అనుమతి లభించిన తర్వాత సానియా మీర్జా మీడియా ముందు మాట్లాడుతూ లండన్ ఒలంపిక్స్‌లో ఇండియా తరుపున పాల్గోనడం నిజంగా ఆనందాన్నిస్తుంది. నా జీవితంలో రెండవ సారి ఒలంపిక్స్‌కు నా భారతదేశం తరుపున ఆడడంతో వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా నాకు అవకాశం కల్పించిన అంతర్జాతీయ టెన్నిస్ ఫెడరేషన్‌కు కృతజ్ఞతలు తెలియజేస్తానని అన్నారు. పేస్‌తో మిక్స్‌డ్ డబుల్స్ ఆడేందుకు సిద్దమన్న సానియా మిర్జా.. టెన్నిస్ సంఘం తనను అవమానించిందని పేర్కొంది. టెన్నిస్ సంఘంతో పాటు పేస్, భూపతిలపైన కూడా సానియా తీవ్ర స్థాయిలో స్పందించింది.
ఇటీవల కాలంలో అఖిల భారత టెన్నిస్ సంఘం లండన్ ఒలంపిక్స్‌కు ఎంపిక చేసిన జట్లపై చాలామంది స్నేహితులు, మీడియా చాలా సందేహాలను వెలిబుచ్చారు. నేను ఆర్హత సాధించలేదు కాబట్టి ఈ ప్రశ్నలకు పూర్తిగా ఊహాత్మక భావించాను, ఆ సమయంలో వారికి ప్రతిస్పందన కోసం అది సరైన భావించ లేదు. ఇక మిక్సడ్ డబుల్స్ ఈవెంట్ ఎంపికపై భారత టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా ఆల్ ఇండియన్ టెన్నిస్ అసోసియేషన్‌పై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఒలింపిక్స్ కోసం మిక్స్‌డ్ డబుల్స్ టీమ్‌ను ఎంపిక చేసిన తీరుపై ఆమె ధ్వజమెత్తింది.
అయితే ఇటీవల ఇండియన్ టెన్నిస్‌లో జరగుతున్న పరిణామాలు తనను వత్తిడికి గురిచేశాయని సానియా తెలిపింది. 21వ శతాబ్దపు భారతీయ మహిళగా నాకిది అవమానం. రెండు గ్రాండ్ స్లామ్‌లు గెలిచిన, దశాబ్దకాలంగా భారత్ నెంబర్ వన్ క్రీడాకారిణిగా ఉన్న నన్ను ఎంపిక చేసిన తీరు పురుషాధిక్యానికి నిదర్శనం అని చెప్పింది.
తెలుగు వన్ఇండియా