పిక్చర్స్: వింబుల్డన్ ఫైనల్లో కొత్త భామల మధ్య పోటీ
లండన్: వింబుల్డన్ మహిళ సింగిల్స్‌లో కొత్త భాములు ఫైనల్లోకి దూసుకొచ్చారు. ఫ్రాన్స్‌కు చెందిన 15వ సీడ్ మరియన్ బర్టోలీ కెరీర్‌లో రెండోసారి, జర్మనీ క్రీడాకారిణి సబినె లిసికీ కెరీర్‌లో మొదటిసారి వింబుల్డన్ ఫైనల్‌కు దూసుకెళ్లారు. 2007లో రన్నరప్‌గా నిలిచిన బర్టోలీ తొలి టైటిల్ వేటలో మరో అడుగు ముందుకేసింది. శుక్రవారం ఏక పక్షంగా సాగిన సెమీ ఫైనల్‌లో ఆమె కిర్‌స్టెన్ ఫ్లిప్కెన్స్‌ను 6-1, 6-2 తేడాతో ఓడించింది.
మ్యాచ్ ఆరంభం నుంచే ప్రారంభమైన బర్టోలీ విజృంభణ చివరి వరకూ కొనసాగింది. ఆమెకు గట్టిపోటీనివ్వలేకపోయిన ఫ్లిప్కెన్స్ ఓటమిని కొనితెచ్చుకుంది. 2011 ఫ్రెంచ్ ఓపెన్‌లో సెమీస్ వరకూ చేరిన బర్టోలీ తన కెరీర్‌లో జస్టిన్ హెనిన్, జలెనా జకొవిచ్, విక్టోరియా అజరెంకా, సెరెనా విలియమ్స్, అరంటా సాంచెజ్ వికారియో, అనా ఇవానొవిచ్, లిండ్సే డావెన్‌పోర్ట్, పెట్రా క్విటోవా, సమంత స్టొసుర్, కిమ్ క్లిజ్‌స్టెర్స్ వంటి మేటి క్రీడాకారిణులను ఓడించింది.

వింబుల్డన్ సెమీ ఫైనల్లో పోలండ్‌కు చెందిన అగ్నీస్కా రద్వాన్‌స్కాని ఓడించిన తర్వాత ఆనందంతో తడిసిముద్దయిన జర్మనీకి చెందిన సబినే లిసికి.

వింబుల్డన్ సెమీ పైనల్లో అగ్నీస్కా రద్వాన్‌స్కాని ఓడించడానికి లిసికి హోరాహోరీ పోరాటం చేసింది.

వింబుల్డన్ మహిళా సింగిల్స్ సెమీ ఫైనల్లో బెల్జియంకు చెందిన కిర్‌స్టన్ ఫ్లిప్‌కెన్స్‌తో పోరాడుతూ ఫ్రాన్స్‌కు చెందిన మరియన్ బర్టోలీ

మరియన్ బర్టోలీపై సెమీ ఫైనల్లో బెల్జియం దేశానికి చెందిన మరియన్ బర్టోలీపై తలపడుతూ ఇలా..

కిర్‌స్టన్ ఫ్లిప్‌కిన్స్‌ను ఓడించిన తర్వాత విజయోత్సాహంతో మరియన్ బర్టోలీ ఇలా..
ఈసారి వింబుల్డన్‌లో జెయింట్ కిల్లర్ అవతారం ఎత్తిన లిసికీ అసాధారణ విజయాలతో సంచలనాలు సృష్టించింది. టాప్ సీడ్ క్రీడాకారిణులు ఆమె ధాటికి టోర్నీ నుంచి నిష్క్రమించారు. తొలి రౌండ్‌లో ఫ్రాన్సిస్కా షియవోన్‌ను, రెండో రౌండ్‌లో ఎలెనా వెస్నినాను ఓడించిన ఆమె, మూడో రౌండ్‌లో ఆస్ట్రేలియా స్టార్ సమంత స్టొసుర్‌పై గెలుపొందింది. ఆ తర్వాత ప్రపంచ నంబర్‌వన్, డిఫెండింగ్ చాంపియన్ సెరెనా విలియమ్స్‌ను ప్రీ క్వార్టర్స్‌లో చిత్తుచేసింది. క్వార్టర్ ఫైనల్స్‌లో కైక కనేపీపై విజయం సాధించింది.
సెమీ ఫైనల్‌లో నాలుగో సీడ్ అగ్నీస్కా రద్వాన్‌స్కాతో హోరాహోరీగా తలపడి 6-4, 2-6, 9-7 స్కోరుతో గెలుపొంది ఫైనల్‌లో స్థానం సంపాదించింది. ఈ టోర్నీలో లిసికీ ఆడుతున్న తీరు, ఆమె సాధిస్తున్న విజయాలను చూస్తే, ఫైనల్‌లో బర్టోలీని ఓడించి టైటిల్ సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అద్భుతమైన ఫామ్‌లో ఉన్న లిసికీని శనివారం నాటి ఫైనల్‌లో బర్టోలీ ఎంత వరకు నిలువరిస్తుందో చూడాలి.
బొపన్న ఓటమి పురుషుల డబుల్స్ విభాగంలో ఎడురార్డ్ రోజర్ వెసెలిన్‌తో కలిసి ఆడుతున్న భారత క్రీడాకారుడు రోహన్ బొపన్న పరాజయాన్ని ఎదుర్కొన్నాడు. 'బ్రయాన్ సోదరులు' బాబ్, మైక్ జోడీని ఢీకొన్న బొపన్న, వెసెలిన్ 7-6, 4-6, 3-6, 7-5, 3-6 తేడాతో పరాజయాన్ని చవిచూశారు. వీరు చివరి వరకూ పోరాడినప్పటికీ ఫలితం లేకపోయింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications