Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

టాప్ సీడ్ షరపోవా ఇంటికి, క్వార్టర్‌ ఫైనల్‌కు సెరెనా

Maria Sharapova
లండన్, జూన్ 3: వింబుల్డన్ ఓపెన్‌లో టాప్ సీడ్ మరియా షరపోవా(రష్యా) ప్రీక్వార్టర్ ఫైనల్లోనే ఇంటి దారి పట్టింది. ఒకే యేడాది ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్ టైటిల్స్‌ని సొంతం చేసుకుందామన్న షరపోవా ఆశలు అడియాశలయ్యాయి. వివరాల్లోకి వెళితే నిన్న జరిగిన మ్యాచ్‌లో జర్మనీకి చెందిన 15వ సీడ్‌ సబీనా 6-4, 6-3 తేడాతో షరపోవాను చిత్తు చేసింది. గత ఏడాది ఇదే వేదికపై సెమీఫైనల్లో... ఈ ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్ ప్రిక్వార్టర్ ఫైనల్లో షరపోవా చేతిలో ఎదురైన పరాజయాలకు 15వ సీడ్ సబీనా లిసికి (జర్మనీ) బదులు తీర్చుకుంది.

ఆట ప్రారంభం నుండే సబీనా లిసికి అధ్బుతంగా ఆడింది. తన మార్క్‌ షాట్లతో చెలరేగిన లిసికి మ్యాచ్‌పై పట్టు బిగించింది. మరోవైపు టాప్‌ సీడ్‌ షరపోవా తీవ్ర ఒత్తిడిలో కనిపించింది. దీంతో వరుస తప్పిదాలకు పాల్పడింది. దీన్ని తనకు అనుకూలంగా మార్చుకున్న లిసికి 6-4తో తొలి సెట్‌ను సొంతం చేసుకొంది. తర్వాతి సెట్‌లోనూ లిసికి హవా కొనసాగించింది. అద్భుత షాట్లతో చెలరేగిన లిసికి 4-1 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఈ క్రమంలో షరపోవా రెండు గేమ్‌లను గెలిచినా ఫలితం లేకుండా పోయింది.

ఏకపక్షంగా సాగిన సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో లిసికి 6-3, 6-4తో ప్రపంచ నంబర్‌వన్ షరపోవాను ఓడించి క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. 'ఏస్'తో మ్యాచ్‌ను ముగించి భావోద్వేగంతో అభిమానులవైపు చూస్తూ కంటతడి పెట్టుకుంది.

మరోవైపు అమెరికా స్టార్‌, నాలుగు సార్ల విజేత సెరెనా విలియమ్స్‌ క్వార్టర్‌ ఫైనల్‌కు చేరుకొంది. సోమవారం జరిగిన నాలుగో రౌండ్‌లో ఆరో సీడ్‌ సెరెనా 6-1, 2-6, 7-5 తేడాతో కజకిస్థాన్‌ సంచలనం ష్వెదోవాను ఓడించింది. తొలి సెట్‌ను సునాయాసంగా గెలుచుకున్న సెరెనాకు తర్వాతి సెట్‌లో ప్రత్యర్థి నుంచి గట్టి పోటీ ఎదురైంది. తన మార్క్‌ ఆటతో చెలరేగిన ష్వెదోవా 6-2తో సెట్‌ను గెలుచుకొంది.

ఇతర ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో ఎనిమిదో సీడ్ కెర్బర్ (జర్మనీ) 6-1, 6-1తో క్లియ్‌స్టర్స్ (బెల్జియం)పై; డిఫెండింగ్ చాంపియన్, నాలుగో సీడ్ క్విటోవా (చెక్ రిపబ్లిక్) 4-6, 7-5, 6-1తో షియవోని (ఇటలీ)పై; మూడో సీడ్ అగ్నెస్కా రద్వాన్‌స్కా (పోలండ్) 6-2, 6-3తో కామిల్లా గియార్గి (ఇటలీ)పై; కిరిలెంకో (రష్యా) 6-1, 6-7 (6/8), 6-3తో షుయె పెంగ్ (చైనా)పై; తమీరా పాసెక్ (ఆస్ట్రియా) 6-2, 6-2తో రొబెర్టా విన్సీ (ఇటలీ); రెండో సీడ్ అజరెంకా (బెలారస్) 6-1, 6-0తో 14వ సీడ్ అనా ఇవనోవిచ్ (సెర్బియా)పై గెలుపొందారు. క్వార్టర్ ఫైనల్స్‌లో కెర్బర్‌తో లిసికి; రద్వాన్‌స్కాతో కిరిలెంకో; సెరెనాతో క్విటోవా; తమీరాతో అజరెంకా తలపడతారు.

పురుషుల సింగిల్స్‌లో ఫెదరర్ (స్విట్జర్లాండ్), యూజ్నీ (రష్యా) క్వార్టర్ ఫైనల్ పోరుకు సిద్ధమయ్యారు. ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో ఫెడరర్ 7-6 (7/1), 6-1, 4-6, 6-3తో మలీజ్ (బెల్జియం)పై... యూజ్నీ 6-3, 5-7, 6-4, 6-7 (4/7), 7-5తో ఇస్టోమిన్ (ఉజ్బెకిస్థాన్)పై గెలుపొందారు.

తెలుగు వన్ఇండియా

Story first published: Tuesday, November 14, 2017, 10:15 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+