
ఈరోజు సాయంత్రం 6.30 నిమిషాలకు జరగనున్న పురుషుల సింగిల్స్‌లో ఫెడరర్ గెలిస్తే... గతంలో ఏడుసార్లు వింబుల్డన్ టైటిల్స్ నెగ్గిన పీట్ సంప్రాస్ (అమెరికా), విలియమ్ రెన్‌షా (బ్రిటన్) రికార్డుని సమం చేస్తాడు. మళ్లీ ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్‌కు చేరుకుంటాడు. దీనితో పాటు అత్యధికంగా 286 వారాలపాటు నంబర్‌వన్ ర్యాంక్‌లో కొనసాగిన పీట్ సంప్రాస్ రికార్డును సమం చేస్తాడు.
ఇక ఆండీ ముర్రే విషయనికి వస్తే 1936లో ఫ్రెడ్ పెర్రీ తర్వాత పురుషుల సింగిల్స్‌లో గ్రాండ్‌స్లామ్ టైటిల్ సాధించిన తొలి బ్రిటన్ క్రీడాకారుడిగా గుర్తింపు పొందుతాడు. అంతేకాకుండా తన కెరీర్‌లో తొలి గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను నమోదు చేసుకుంటాడు. ఇప్పటివరకు కెరీర్‌లో ఆడిన మూడు గ్రాండ్‌స్లామ్ ఫైనల్స్‌లోనూ ముర్రేకు చుక్కెదురైంది. అతను ఫైనల్స్‌లో ఒక్క సెట్‌నూ గెల్చుకోలేకపోయాడు. రోజర్ ఫెదరర్‌తో నాలుగో గ్రాండ్‌స్లామ్ ఫైనల్ ఆడుతున్నాడు.
ఇప్పటివరకు రోజర్ ఫెదరర్, ఆండీ ముర్రే ముఖాముఖిగా 15 సార్లు తలపడ్డారు. 8 మ్యాచ్‌ల్లో ఆండీ ముర్రే, 7 మ్యాచ్‌ల్లో రోజర్ ఫెదరర్ గెలిచారు. అయితే వింబుల్డన్‌లో మాత్రం ఈ ఇద్దరూ తొలిసారి ముఖాముఖి పోరులో తలపడుతున్నారు.
తెలుగు వన్ఇండియా