For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఫ్రెంచ్ ఓపెన్ క్వార్టర్ ఫైనల్: ఫెదరర్‌కు సొంగా షాక్

By Pratap
Tsonga stuns Federer to reach French Open semifinals
పారిస్: ఫ్రెంచ్ ఓపెన్ క్వార్టర్ ఫైనల్‌లో రెండో సీడ్ స్విస్ ఆటగాడు రోజర్ ఫెదరర్‌కు షాక్ తగిలింది. టైటిల్ సొంతం చేసుకోవాలని నాలుగేళ్లుగా తపిస్తున్న ఫెదరర్‌కు నిరాశే ఎదురైంది. మంగళవారం జరిగిన క్వార్టర్‌ఫైనల్ మ్యాచ్‌లో ఆరో సీడ్ ఫ్రాన్స్ ఆటగాడు జో విల్‌ఫ్రెడ్ సోంగాతో తలపడిన ఫెదరర్ 5-7, 3-6, 3-6తో మూడు వరుస సెట్లలో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించాడు. సోంగా సెమీ ఫైనల్‌లో డేవిడే ఫెర్రర్‌తో తలపడాల్సి ఉంటుంది.

మరో మ్యాచ్‌లో స్పెయిన్ ఆటగాడు డేవి డ్ ఫెర్రర్ సునాయాస విజయాన్ని నమోదు చేశాడు. క్వార్టర్‌ఫైనల్ మ్యాచ్‌లో తనదేశానికే చెందిన టామీ రో బ్రెడోతో తలపడిన ఫెర్రర్ 6-2, 6-1, 6-1తో వరుస సెట్లను చేజిక్కించుకుని సెమీస్ చేరాడు.

కష్టంగా గట్టెక్కిన సెరెనా

మహిళల సింగిల్స్‌లో టాప్ సీడ్ సెరెనా విలియమ్స్ కష్టంగా బయటపడింది.క్వార్టర్‌ఫైనల్లో స్వెత్లానా కుజ్నెత్సోవా (రష్యా)పై 6-1, 3-6, 6-3తో మూడు సెట్లపాటు పోరాడి నెగ్గి పదేళ్ల తర్వాత సెమీస్‌కు చేరింది. ఇదే విభాగంలో ఇటలీ భామ సారా ఎరానీ సెమీస్ బెర్త్ ఖాయం చేసుకుంది. క్వార్టర్స్‌లో పోలాండ్ క్రీడాకారిణి రద్వాన్‌స్కాతో తలపడిన సారా ఎరానీ 6-4, 7-6(6)తో నెగ్గి టోర్నీలో ముందంజ వేసింది.

సానియా, పేస్ జోడీలు ఇంటి దారి..

ఫ్రెంచ్ ఓపెన్‌లో సానియా జోడీ పోరు ముగిసింది. మహిళ ల డబుల్స్‌లో బెథానీ మాటెక్ (అమెరికా)తో జో డీ కట్టిన సానియా క్వార్టర్స్ చేరకుండానే ఇంటిదారి పట్టింది. మంగళవారం ఇక్కడ జరిగిన ప్రీ క్వా ర్టర్స్ మ్యాచ్ రెండో సెట్‌లో తన భాగస్వామి బెథానీ తుంటి సమస్యతో రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగడంతో ప్రత్యర్థి జోడీ అనస్తాసియా పావ్లాచెంకోవా-లూసీ సాఫరోవా శ్రమలేకుండానే క్వార్టర్స్‌కు చేరుకుంది. తొలి సెట్‌ను 7-6 (0)తో సానియా జో డీ కైవసం చేసుకున్నా రెండో సెట్‌లో స్కోరు 3-5గా ఉన్న సమయంలో బెథానీ రిటైర్డ్ హర్ట్ అ వడంతో ఆ శ్రమ వృధా అయింది.

ఇక భారత స్టార్ ఆటగాడు లియాండర్ పేస్ కూడా అదే బాటలో నడిచాడు. మిక్స్‌డ్ డబుల్స్ రెండో రౌం డ్‌లో జెలీనా జంకోవిచ్ (సెర్బియా)తో జోడీ కట్టిన పేస్.. 5-7, 7-6(1), (2-10)తో లీజెల్ హ్యూబర్ (అమెరికా)-మార్సెలో మేలో (బ్రెజి ల్) ద్వయం చేతిలో పరాజయం పాలైంది. దీంతో భారత పోరు ముగిసింది.

Story first published: Tuesday, November 14, 2017, 10:15 [IST]
Other articles published on Nov 14, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+