
ఈ సందర్భంగా సానియా మాట్లాడుతూ ''చిన్నారులతో టెన్నీస్ ఆడటమంటే తనకెప్పుడూ సంతోషమే, తానెక్కడికి పోయినా చిన్నారులను కలుస్తుంటా, ఎందుకంటే టెన్నీస్ పట్ల వారిలో ఎంతమేర ఉత్సుకత ఉంది అన్న విషయం తెలసుకోవడానిక ప్రయత్నిస్తుంటా'' అని పేర్కొన్నారు. ఓ టెన్నిస్ క్రీడాకారిణిగా అందరూ ఈ ఆట ఆడితే చూడాలని ఉంటుంది, ముఖ్యంగా చిన్నారుల ఆటతీరును చూసి ముగ్ధురాలనవుతుంటానని సానియా మీర్జా తెలిపారు.
యేల్ యూనివర్శిటీలో చాలా ఆహ్లాదకరమైన వాతావరణంలో చిన్నారులు ఆడితే ఇంకా బాగుంటుంది. చిన్నారులకు ఇలాంటి శిబిరాలు మరింత ప్రోత్సాహకంగా ఉంటాయిని చెప్పింది. సానియామీర్జా ఇటీవలే న్యూ హవెన్ ఓపెన్ టోర్నమెంట్ డబుల్స్‌లో విజయం సాధించిన విషయం తెలిసిందే.
తెలుగు వన్ఇండియా