Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

యుఎస్ ఓపెన్: ఓటమితో టెన్నిస్‌కు రాడిక్ గుడ్ బై

Tennis Career of Andy Roddick Ends at U.S. Open
న్యూయార్క్, సెప్టెంబర్ 6: అంతర్జాతీయ టెన్నిస్ నుండి మరో మాజీ ప్రపంచ నెంబర్ వన్ గుడ్ బై పలికాడు. ప్రస్తుతం న్యూయార్క్‌లో జరుగుతున్న యుఎస్ ఓపెన్ టోర్నమెంట్లో అర్జెంటీనా ఆటగాడు మార్టిన్ డెల్ పోత్రో చేతిలో 6-7, 7-6, 6-2, 6-4లో పరాజయం పాలైన అండీ రాడిక్ తన కెరీర్‌కు వీడ్కోలు చెప్పాడు. దీంతో అంతర్జాతీయ టెన్నిస్‌లో కెరీర్‌ను విషాదంతో రాడిక్ ముగించాడు.

ఆగష్టు 30, 1982 అమెరికాలో జన్మించిన ఆండీ రాడిక్ అమెరికన్ ప్రొఫెషనల్ టెన్నిస్ ఆటగాడు, మాజీ ప్రపంచ నెంబర్ వన్. ATP టాప్ 10లో ఉన్న ఏకైక అమెరికన్ ఆండీ రాడిక్ కావడం విశేషం. 2003 యుఎస్ ఓపెన్ ఫైనల్స్‌లో జువాన్ కార్లోస్ ఫెర్రెరోను ఓడించి గ్రాండ్ స్లామ్ సింగిల్స్ చాంపియన్ టైటిల్‌ను గెలుచుకున్నాడు. ఆ తర్వాత ఆగస్టు 23, 2012 నాటికి ATP ప్రకటించిన ర్యాంకింగ్స్‌లో వరల్డ్ నెంబర్ 9 ర్యాంకింగ్‌ని సొంతం చేసుకున్నాడు.

తన 12 సంవత్సరాల సుదీర్గ కెరీర్లో 2003 యూఎస్ ఓపెన్ తోపాటు 32 టైటిల్స్, 20 మిలియన్ డాలర్ల ప్రైజ్ మనీ గెలుచుకున్నారు. అంతేకాకుండా తన టెన్నిస్ కెరీర్ లో మూడు సార్లు వింబుల్డన్ రన్నరప్ గా నిలిచాడు. ఇప్పటి వరకు అండీ రాడిక్ నాలుగు గ్రాండ్ స్లామ్ ఫైనల్స్ కు చేరుకున్నాడు (వింబుల్డన్ మూడుసార్లు మరియు యుఎస్ ఓపెన్ ఒకసారి), ప్రతిసారీ అతను రోజర్ ఫెదరర్ చేతిలో ఓడిపోయాడు.

2002 నుండి 2009 వరకు ప్రతి సంవత్సరం ఫెదరర్‌తో పాటు ఆండీ రాడిక్ అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ టాప్ 10లో స్థానం పొందాడు. టెన్నిస్‌లో అత్యంత శక్తివంతమైన సర్వీస్‌కు రాడిక్ పేరు. ప్రొఫెషనల్ టెన్నిస్‌లో రికార్డు చేయబడిన వేగవంతమైన సర్వ్ అతనిదే, దాని వేగం 155 mph. పురుషుల గ్రాండ్ స్లామ్ సింగిల్స్ పోటీ (2003 యుఎస్ ఓపెన్) గెలుపొందిన ఆఖరి అమెరికన్ ఆటగాడు ఆండీ రాడిక్ కావడం విశేషం.

తెలుగు వన్ఇండియా

Story first published: Tuesday, November 14, 2017, 10:15 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+