
నిర్ణాయత్మకమైన సెట్‌లో సెరెనా 3-5 స్కోరుతో వెనకబడిపోయింది. అయితే 9 గేమ్‌లో సెరెనా పుంజుకుంది. మూడో సెట్ 11వ గేమ్‌లో అజరెంకాపై ఒత్తిడి పెరిగింది. మొత్తం మీద సెరెనా అజరెంకాపై 6-2, 2-6, 7-5 స్కోరుతో గెలిచింది. యుఎస్ ఓపెన్ టైటిల్ విజయంతో సెరెనా ఒకే ఏడాది వింబుల్డన్, ఒలింపిక్స్, అమెరికా ఓపెన్ గెలుచుకున్న తన సోదరి వినస్, స్టెఫీ గ్రాఫ్ సరసన చేరింది.
నిజంగా చెప్పాలంటే తాను గెలిచానంటే విశ్వాసం కలగడం లేదని సెరెనా అన్నారు. రన్నరప్ స్పీచ్ కోసం తాను సిద్దపడుతున్నానని, అ సమయంలో దిగ్భ్రాంతికి గురయ్యానని, విజయం విశిష్టమైందని ఆమె చెప్పారు. సెరెనా సెప్టెంబర్ 26వ తేదీతో 31వ పడిలో పడుతున్నారు.
సెరెనా విజయానికి అర్హురాలని అజరెంకా అన్నారు. ఎంతటి ఛాంపియనో సెరెనా నిరూపించిందని ఆమె ప్రశంసించారు. తాను తీవ్రంగానే ప్రతిఘటించానని, ఓడినందుకు విచారం లేదని ఆమె అన్నారు. సెరెనా ఇప్పటి వరకు 14 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ గెలుచుకుంది. విలియమ్స్ ఇంతకు 1999, 2002, 2008ల్లో యుఎస్ ఓపెన్ టైటిల్స్ గెలుచుకుంది.