Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

యుఎస్ ఓపెన్ విజేత సెరెనా: పేస్ జోడీకి టైటిల్

న్యూయార్క్: అమెరికా క్రీడాకారిణి సెరెనా విలియమ్స్ 16వ గ్రాండ్ స్లామ్‌ను తన ఖాతాలో వేసుకుంది. యూఎస్ ఓపెన్ టెన్నిస్ టోర్నీ మహిళల సింగిల్స్ టైటిల్ ఫైనల్లో విక్టోరియా అజరెంకాను ఓడించి ఈ ఘనతను సాధించింది సెరినా. ఆదివారం జరిగిన ఫైనల్లో విక్టోరియా అజరెంకాపై 7-5, 6-7, 6-1 తేడాతో సెరెనా విలియమ్స్ విజయం సాధించింది.

మొదటి సెట్‌లో సెరెనాతో అజరెంకా పోటా పోటీగా ఆడినప్పటికీ సెరెనా 7-5తో సెట్ ను సొంతం చేసుకుంది. రెండో సెట్‌లోనూ అదేవిధంగా పోటీ పడిన విక్టోరియా అజరెంకా..సెరెనా విలియమ్స్ పై పైచేయి సాధించింది. కాగా మూడో సెట్ కూడా అంతే పోటాపోటీగా సాగుతుందనుకున్నా సెరెనా తన బలమైన షాట్లతో ప్రత్యర్థిపై విరుచుకుపడడంతో విక్టోరియా చేతులెత్తేసింది. దీంతో 6-1తో మూడో సెట్ తోపాటు టోర్నీని కైవసం చేసుకుంది సెరెనా విలియమ్స్.

Serena Williams beats Victoria Azarenka to clinch fifth US Open crown

టోర్నీలో తన ప్రదర్శన పట్ల సంతృప్తి వ్యక్తం చేసిన సెరెనా విలియమ్స్, టోర్నీ గెలుచుకోవడం ఆనందం ఉందని చెప్పారు. విక్టోరియా కూడా మంచి పోటీ ఇచ్చిందని తెలిపారు. యూఎస్ ఓపెన్ గెలుచుకోవడం సెరెనా విలియమ్స్‌కు ఇది ఐదోసారి. టోర్నీ గెలిచిన సెరెనాకు 3.6 మిలియన్ డాలర్ల మనీ ప్రైజ్ లభించనుంది.

విక్టోరియా అజరెంకా మూడో సెట్‌లో చేసిన తప్పులే సెరెనా విలియమ్స్‌కు విజయాన్నందించడంలో కీలక పాత్ర పోషించాయి. మూడో సెట్‌లో సెరెనా విలియమ్స్ పుంజుకోవడంతో విక్టోరియాకు ఓటమి తప్పలేదని సెరెనా విలియమ్స్ కోచ్ పాట్రిక్ చెప్పారు. సెరెనా విలియమ్స్ తన 16వ యేటనే 199 6లోజరిగిన యూఎస్ ఓపెన్ మహిళల సింగిల్స్ టెన్నిస్ టైటిల్ గెలుచుకున్నారు.

పేస్ జోడీకే యూఎస్ డబుల్స్ టైటిల్

భారత డబుల్స్ స్టార్ లియాండర్ పేస్ ఖాతాలో మరో గ్రాండ్ స్లామ్ చేరింది. చెక్ ఆటగాడు రాడెక్ స్టెపనెక్ తో కలిసి లియాండర్ పేస్ యూఎస్ ఓపెన్ పురుషుల డబుల్స్ టైటిల్‌ను గెలుచుకున్నాడు. ఆదివారం జరిగిన ఫైనల్లో నాలుగో సీడ్ పేస్-స్టెపనెక్ జంట రెండో సీడ్ అలెగ్జాండర్ పెయా(ఆస్ట్రియా), బ్రూనో సొరెన్ (బ్రెజిల్) జోడీని చిత్తుగా ఓడించింది.

ఏకపక్షంగా సాగిన ఈ పోరులో 6-1, 6-3 తేడాతో పేస్ జోడీ విజయం సాధించింది. పేస్-స్టెపనెక్ చెలరేగి ఆడడంతో ప్రత్యర్థి ఆటగాళ్లు చేతులెత్తేయలేక తప్పలేదు. ఏ దశలోనూ పేస్ జోడీకి ప్రత్యర్థి జోడీ పోటీ ఇవ్వలేకపోయింది. ఏడు డబుల్ ఫాల్టులు చేసిన ప్రత్యర్థి జోడీకి ఓటమి తప్పలేదు.

నిరుడు కూడా స్టెపనెక్‌తోపాటే ఆడి రన్నరప్ గా నిలిచిన పేస్ ప్రస్తుతం టైటిల్ సొంతం చేసుకున్నాడు. లియాండర్ పేస్ కెరీర్‌లో ఇది 14వ గ్రాండ్ స్లామ్ టైటిల్. ఇందులో 8 డబుల్స్ కాగా 6 మిక్స్‌డ్ డబుల్స్. టైటిల్ గెలవడం పట్ల పేస్ సంతోషం వ్యక్తం చేశారు. చెక్ ఆటగాళ్లు టోర్నీ గెలవడంతో కోసం చాలా కష్టపడతారని స్టెపనెక్‌ను కొనియడారు.

Story first published: Tuesday, November 14, 2017, 10:15 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+