
73 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో తొలిసెట్‌లో ఓ దశలో 3-5తో వెనుకబడ్డ సానియా-మహేశ్ జోడి నిదానంగా పుంజుకుంది. తొమ్మిదో గేమ్‌ను బ్రేక్ చేసి ఆపై సర్వీస్‌ను నిలబెట్టుకుని స్కోరును సమం చేశారు. సెట్ టైబ్రేక్‌కు దారితీయగా 7-3తో నెగ్గింది. ఇక రెండో సెట్‌లో సానియా-భూపతి జోడికి ఎదురే లేకుండా పోయింది. సానియా కెరీర్‌లో ఇది రెండో గ్రాండ్‌స్లామ్ టైటిల్. ఇదే జోడి 2009లో ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో మిక్స్‌డ్ విజేతగా నిలిచింది.
మహేశ్ భూపతి కెరీర్‌లో ఇది ఎనిమిదో మిక్స్‌డ్ గ్రాండ్‌స్లామ్ టైటిల్. అతడు ఆస్ట్రేలియన్ ఓపెన్ (2006, 2009), ఫ్రెంచ్ ఓపెన్ (1997, 2012), వింబుల్డన్ (2002, 2005), యుఎస్ ఓపెన్ (1999, 2005)లో మిక్స్‌డ్ టైటిల్స్ గెలిచాడు.
తెలుగు వన్ఇండియా