
27 ఏళ్ల నాదలో 2010లో ఓసారి, ఇప్పుడు యుఎస్ ఓపెన్ టైటిల్ గెలుచుకున్నాడు. అతను ఈ సీజన్‌లో వరుసగా పది టైటిళ్లు గెలుచుకున్నాడు. మొత్తం 60 విజయాలు సాధించి, మూడు మాత్రమే ఓడిపోయాడు. సోమవారంనాటి విజయం వల్ల అతనికి 3.6 మిలియన్ డాలర్లు దక్కుతాయి.
ఇది అత్యంత ఉద్వేగపూరితమైందని, ఇది తనకు ఎంత అవసరమో తన సభ్యులందరికీ తెలుసునని నాదల్ అన్నాడు. నోవాక్ ఎల్లవేళలా తన ఆటను పరిమితం చేస్తాడని, అతను అద్భుతమైన ఆటగాడని, క్రీడల్లో అత్యంత గొప్ప ఆటగాళ్లలో అతను ఒక్కడని నాదల్ అన్నాడు.
రఫెల్ నాదల్ బాగా ఆడాడని, విజయానికి అర్హుడని నోవాక్ జకోవిచ్ అన్నాడు. ఈ మ్యాచులో ఓడిపోవడం తనను అసంతృప్తికి గురి చేసిందని, అయితే, ట్రోఫీ కోసం పోరాడే గౌరవం దక్కిందని ఆయన అన్నాడు.