Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఆస్ట్రేలియా ఓపెన్ మెన్స్ డబుల్స్ సాధించిన పేస్ జోడీ

Leander Paes
మెల్‌బోర్న్: భారత క్రీడాకారుడు లియాండర్ పేస్ ఆస్ట్రేలియా ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ పురుషుల డబుల్స్ టైటిల్‌ను సాధించాడు. లియాండర్ పేస్, తన జోడి రాడెక్ స్టెపనెక్ అద్భుతంగా ఆడి బ్రయన్ బ్రదర్స్‌ను ఓడించింది. ఆస్ట్రేలియా గ్రాండ్ స్లామ్‌ను పేస్ తొలిసారిగా పురుషుల డబుల్స్‌లో సాధించాడు. చిరకాల ప్రత్యర్థులైన బ్రయన్ సోదరులను పేస్ ఈసారి రాడెక్‌తో కలిసి ఆస్ట్రేలియా ఓపెన్‌లో ఓడించారు. పేస్-రాడెక్ జోడి అమెరికాకు చెందిన బ్రయన్ సోదరుల జోడిని 7-6, 6-2 తేడాతో ఓడించింది.

పేస్‌కు ఇది పదో గ్రాండ్ స్లామ్. ఆస్ట్రేలియా గ్రాండ్‌ను సాధించిన తొలి భారతీయునిగా లియాండర్ పేస్ చరిత్ర సృష్టించారు. పేస్‌కు ఇది 13 వ గ్రాండ్ స్లామ్ టైటిల్. భారత్‌కు చెందిన లియాండర్ పేస్, చెక్‌కు చెందిన రాడెక్ కలిసి చెలరేగి ఆడారు. వారి ప్రత్యర్థులు అయిన బాబ్ బ్రయన్, మైక్ బ్రయన్‌లు గతంలో రెండు సార్లు పేస్ జోడిని ఓడించారు. పేస్ గతంలో మూడుసార్లు ఆస్ట్రేలియా ఓపెన్ పురుషుల డబుల్స్‌లో ఫైనల్ వరకూ చేరారుగాని విజేతగా నిలవలేకపోయారు. అందులో రెండుసార్లు బ్రయన్ సోదరుల చేతిలోనే ఓడిపోయారు.

1990 వ దశకంలో పేస్ ఆనాటి తన మిత్రుడు మహేశ్ భూపతితో కలిసి ఆడారు. అప్పట్లో ఈ జోడి ఎంతో కష్టపడింది. మళ్లీ 11 ఏళ్ల తర్వాత 2011లో వీరు మళ్లీ కలిసి ఆడారు. కాని అదృష్టం కలిసిరాలేదు. ఇటీవల మహేశ్ భూపతి తన జోడిగా బోపణ్ణను స్వీకరించడంతో ఈ జోడి మళ్లీ విడిపోయింది. అంతటితో సెర్బియాకు చెందిన జాంకోతో కలిసి పేస్ ఇటీవల చెన్నై ఓపెన్‌లో ఆడి టైటిల్ సాధించారు. పేస్ ఇప్పటికి ఏడు పురుషుల డబుల్స్ టైటిల్స్, ఆరు మిక్స్‌డ్ డబుల్స్ టైటిల్స్ సాధించారు.
Story first published: Tuesday, November 14, 2017, 10:15 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+