
తొలి సెట్‌లో ఇరు జట్లు తమ సర్వీస్‌లను నిలబెట్టుకోవడంతో స్కోరు 2-2 తో సమమైంది. అలాగే ఐదో గేమ్, ఏడో గేమ్‌కు మరోసారి సెర్బియా జట్టుకు చెక్ పెట్టిన పేస్ జోడీ తొలి సెట్‌ను 26 నిమిషాల్లో ముగించి 6-2 తేడాతో కైవసం చేసుకుంది. ఎనిమిది, తొమ్మిది గేమ్‌లను ఇద్దరూ నిలబెట్టుకోవడంతో స్కోరు 5-3 వద్ద నిలిచింది. అయితే పదో గేమ్‌ను నిలబెట్టుకున్న భారత్ సెట్‌తో మ్యాచ్‌ను గెలిచి క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది.
ఇప్పటికే భారత టెన్నిస్ పురుషుల డబుల్స్ విభాగంలో భూపతి-బోపన్న, లియాండర్ పేస్-విష్ణువర్దన్ పోటీల నుండి వైదొలగడంతో మిక్స్‌డ్ డబుల్స్ పై అందరి దృష్టి పడింది. క్వార్టర్స్‌లో పేస్-సానియా జంట టాప్ సీడ్ మ్యాక్స్ మిర్ని-విక్టోరియా అజరెంకా (బెలారస్)తో తలపడుతుంది.
తెలుగు వన్ఇండియా