
డిఫెండింగ్ ఛాంపియన్ రఫెల్ నాదల్ జకోవిచ్‌పై 6-4, 6-3, 2-6, 7-5 తేడాతో విజయం సాధించాడు. రోలాంగ్ గారోస్‌లో ఏడో టైటిల్ సాధించి అత్యధిక సార్లు రోలాండ్ గారోస్ టైటిల్ దక్కించుకున్న తొలి ఆటగాడిగా నాదల్ రికార్డు సృష్టించాడు. నాదల్‌కు ప్రైజ్ మనీగా 8 కోట్ల 67 లక్షల రూపాయలు లభిస్తాయి.
నాదల్‌కు ఇది 11వ గ్రాండ్ స్లామ్ టైటిల్. ఏడు ఫ్రెంచ్ ఓపెన్, రెండు వింబుల్డన్, ఒక ఆస్ట్రేలియా, ఒక యుఎస్ టైటిల్స్‌ను నాదల్ గెలుచుకున్నాడు. మూడు సెట్ల తర్వాత వర్షం కారణంగా ఆదివారం ఆట ఆగిపోయింది. దీంతో సోమవారం సాగింది. సోమవారం నాలుగో సెట్‌ను నాదల్ 7-5 స్కోరుతో గెలిచి విజేతగా నిలిచాడు.
నాలుగో సెట్‌లో కూడా మొదటి రెండు గేమ్స్ జకోవిచ్ గెలిచాడు. తర్వాతి ఏడు గేమ్‌ల్లోనూ ఏ ఆటగాడు కూడా అడ్వాంటేజ్ తీసుకోలేకపోయాడు. 12 గేమ్‌లో జకోవిచ్ సర్వీసులో డబుల్ ఫాల్ట్ చేశాడు. దాంతో నాదల్ విజయం సాధించాడు.