Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

'రఫా'డించాడు: ఫ్రెంచ్ ఓపెన్ రారాజు నాదల్

Nadal beats Ferrer to win title
పారిస్: ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌శ్లామ్ టెన్నిస్ టోర్నమెంట్‌లో తనకు తిరుగులేదని రఫెల్ నాదల్ మరోసారి నిరూపించుకున్నాడు. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్‌లో అతను తన దేశానికే చెందిన డేవిడ్ ఫెరర్‌ను 6-3, 6-2, 6-3 తేడాతో వరుస సెట్లలో చిత్తుచేసి, ఎనిమిదోసారి ఈ టైటిల్‌ను అందుకున్నాడు. వరుసగా నాలుగో ఏడాది విజేతగా నిలిచి 'క్వడ్రుపుల్' సాధించాడు. 2005 నుంచి 2008 వరకు వరుసగా నాలుగు పర్యాయాలు ఇదే ఫీట్ సాధించిన నాదల్ తిరిగి తన ఆధిపత్యాన్ని చాటాడు.

'రఫా' అని సన్నిహితులు, అభిమానులు ముద్దుగాపిలుచుకునే నాదల్ 12వ గ్రాండ్‌శ్లామ్ టైటిల్‌ను తన ఖాతాలో చేర్చుకున్నాడు. వీటిలో ఎనిమిది ఫ్రెంచ్ ఓపెన్‌లో గెల్చుకున్నవేకాగా, 2008లో ఆస్ట్రేలియా ఓపెన్, 2008, 2010 సంవత్సరాల్లో వింబుల్డన్, 2010లో యుఎస్ ఓపెన్‌లో అందుకున్నాడు. 2008 ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకాన్ని కూడా సాధించాడు. 2010లో యుఎస్ ఓపెన్‌ను గెల్చుకోవడం ద్వారా కెరీర్ గ్రాండ్‌శ్లామ్‌ను పూర్తి చేశాడు.

ఓపెన్ ఎరాలో ఈ ఫీట్‌ను అందుకున్న అత్యంత పిన్న వయస్కుడిగా రికార్డులకుఎక్కాడు. నాలుగు గ్రాండ్‌శ్లామ్ టైటిళ్లతోపాటు, ఒలింపిక్స్ స్వర్ణ పతకాన్ని కూడా అందుకొని, అండ్రీ అగస్సీ తర్వాత కెరీర్ గోల్డెన్ శ్లామ్ సాధించిన రెండో టెన్నిస్ ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. హార్డ్, గ్రాస్ కోర్టుల్లోనూ అద్భుతంగా ఆడే నాదల్ క్లే కోర్టులపై రెచ్చిపోతాడు. అందుకే అతనిని 'ది కింగ్ ఆఫ్ క్లే' అని పిలుస్తారు. 2008 ఆగస్టు 8న ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్‌ను సాధించిన అతను ప్రస్తుతం నాలుగో స్థానంలో ఉన్నాడు.

మోకాలికి శస్త్ర చికిత్స చేయించుకొని కొంత కాలం విశ్రాంతి తీసుకున్న నాదల్ మళ్లీ అంతర్జాతీయ కెరీర్‌ను కొనసాగించి, అసాధారణ ఫామ్‌ను ప్రదర్సించాడు. పలు టోర్నీల్లో అతను గాయం నుంచి పూర్తిగా కోలుకోలేదన్న విషయం స్పష్టమైంది. అయినప్పటికీ అతను తిరుగులేని ఆత్మవిశ్వాసాన్ని ప్రదర్శించగా, ఫెరర్ అందుకు భిన్నంగా ఆడాడు. సెమీ ఫైనల్‌లో విల్‌ఫ్రెడ్ సొంగాను 6-1, 7-6, 6-2 తేడాతో ఓడించి సంచలనం రేపిన అతను ఫైనల్‌లో నీరుగారిపోవడం విచిత్రం. ఒకవైపు నాదల్ తీవ్ర స్థాయిలో దాడులకు దిగితే, మరోవైపు ఫెరర్ అతనికి గట్టిపోటీనివ్వలేకపోయాడు.

Story first published: Tuesday, November 14, 2017, 10:15 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+