Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

సెరెనాపై ఆడితే ఓడిపోతా: ముర్రే, పనైపోలేదు: ఫెదరర్

లండన్: ఐదు సార్లు వింబుల్డన్ చాంపియన్‌షిప్ గెలుచుకున్న సెరెనా విలియమ్స్‌తో తాను తలపడితే తప్పక ఓడిపోతానని ప్రపంచ నెంబర్ 2 ఆటగాడు ఆండీ ముర్రే అంటున్నాడు. తైవాన్‌కు చెందిన యెన్ సున్ లూ తో బుధవారం జరిగిన మ్యాచ్ విజయంతో మూడో రౌండ్లో అడుగుపెట్టిన బ్రిటిష్ ఆటగాడు ముర్రే - సెరెనా విలియమ్స్‌తో తలపడితే తాను ఒడిపోక తప్పదని ట్వీట్ చేశాడు.

ముర్రేపై సెరెనా విజయం సాధించగలదని ఓ అభిమాని పోస్ట్ చేసిన వ్యాఖ్యకు ముర్రే స్పందించాడు. అతని అభిప్రాయంతో తానూ ఏకీభవిస్తున్నానని ప్రకటించాడు

Murray says he will lose against Serena

వింబుల్డన్ చాంపియన్‌షిప్ నుంచి నిష్క్రమించిన రోజర్ ఫెదరర్ తన కెరీర్ అప్పుడే ముగిసి పోలేదని, ఇంకా చాలా ఏళ్లు ఆడతానని చెబుతున్నాడు. వింబుల్డన్‌లో ఏడు టైటిళ్లు నెగ్గి గ్రాస్ కోర్టు రారాజుగా వెలుగొందిన ఫెదరర్ రెండో రౌండ్లో అన్‌సీడెడ్ సెర్జీ స్టాకోస్కీ (ఉక్రెయిన్) చేతిలో ఓడిపోయాడు. అయితే టెన్నిస్‌లో కొన్నిసార్లు ఇలాంటి దురదృష్టకర సంఘటనలు చోటు చేసుకోవడం సహజమేనని అన్నాడు.

ఇంకా కొన్నేళ్లపాటు టెన్నిస్ ఆడాలని అనుకుంటున్నానని మ్యాచ్ అనంతరం ఫెదరర్ అన్నాడు. గ్రాండ్‌స్లామ్స్‌లో వరుసగా 36 సార్లు క్వార్టర్స్‌కు చేరిన ఓ ఆటగాడు ఆరంభంలోనే ఓడిపోతే కెరీర్‌కు గుడ్ బై చెప్పే సమయం వచ్చేసిందా అని అడుగుతుంటారని, అయితే అలాంటిదేమీ లేదని, మరింత కాలం కొనసాగుతానని చెప్పాడు.

Story first published: Tuesday, November 14, 2017, 10:15 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+