Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కడుపొచ్చిందేమోనని భయపడ్డా: మారియా షరపోవా

Maria Sharapova
మాస్కో: ఒంట్లో కొంచెం నలతగా ఉండేసరికి గర్భం వచ్చిందో ఏమోనని భయపడ్డానని చెబుతోంది రష్యా భామ మరియా షరపోవా. అయితే టెస్టుల అనంతరం అలాంటిదేమీ లేదని తేలడంతో ఈ టెన్నిస్ స్టార్ ఊపిరి పీల్చుకుందట! ఇటీవల విపరీతమైన కడుపునొప్పి రావడంతో షరపోవా వైద్యులను ఆశ్రయించింది. వాళ్లేమో..ప్రెగ్నెన్సీ నిర్దారించేందుకు చేసే బ్లడ్ టెస్టులతోపాటు ఆల్ట్రా సౌండ్ స్కానింగ్‌లు చేశారు.

'డాక్టర్లు ఎలాంటి సమస్యా లేదని చెప్పారు. ప్రెగ్నెన్సీ ఏమో అని భయపడ్డాను. అలాంటిదేమీ లేద'ని షరపోవా చెప్పింది. కాగా, మరియాకు బాస్కెట్‌బాల్ ప్లేయర్ వుజాసిక్‌తో నిశ్చితార్థమెనా ఇంతవరకూ పెళ్లి తేదీని ఖరారు చేయలేదు. ఈ నెల ప్రారంభంలో ఈ సంఘటన జరిగింది.

యుఎస్ ఓపెన్ తొలి రౌండులో మెలిందా జింక్‌ను 6-2, 6-2 స్కోరుతో ఓడించిన తర్వాత షరపోవా ఆ జోక్ చేసిది. తమ పెళ్లి నవంబర్‌లో జరగదని ఆమె చెప్పింది. నవంబర్‌లో షరపోవా పుజాసిక్‌ను పెళ్లి చేసుకోబోతున్నట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. మూడో సీడ్ షరపోవా ఎంతటి క్రీడాకారిణో అంతటి అందగత్తె కూడా.

టెన్నిస్ క్రీడలో అత్యంత స్వల్ప వ్యవధిలో అగ్రశేణి క్రీడాకారిణిగా గుర్తింపు పొందింది. పలు విజయాలను సొంతం చేసుకుంది. ప్రపంచవ్యాప్తంగా ఆమెకు అశేషమైన అభిమాన సంపద ఉంది.

Story first published: Tuesday, November 14, 2017, 10:15 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+