దోషకు ఫ్లాటైన షరపోవా: తాజ్‌మహల్ కోసం మళ్లీ వస్తా

తనకు ఇక్కడ చాలా మంది అభిమానులు ఉన్నారని, వారికి ప్రత్యక్షంగా తన ఆటను చూసే అవకాశం రావాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. సానియా మీర్జా గొప్ప నైపుణ్యం గల క్రీడాకారిణి అన్నారు. ఆమెతో ఆడి చాలా ఏళ్లయిందని, కేవలం డబుల్స్ మాత్రమే ఆడాలన్న సానియా నిర్ణయం సరైందే అన్నారు. టెన్నిస్‌లో రెండు ఫార్మాట్లలో ఆడటం చాలా కష్టమని షరపోవా అన్నారు. కేరీర్లో గొప్ప విజయమేదని అంటే చెప్పడం కష్టమే అన్నారు.
నాలుగు గ్రాండ్ స్లామ్ టైటిళ్లు కెరీర్లో భిన్న సమయాల్లో వచ్చాయని, ఈ ఏడాది ఫ్రెంచ్ ఓపెన్ గెలుపు ప్రత్యేకమైందన్నారు. చాలాకాలం గాయంతో ఇబ్బంది పడ్డాక దీనిని గెలిచానని, ఇది తనకు ఎంతో సంతృప్తినిచ్చిందన్నారు. భారత్ పర్యటనకు రావడం ఓ మధురానుభూతి అని, ఇక్కడి రావాలని చాలా కాలం నుంచి ఎదురుచూస్తున్నానని, అది ఇన్నాళ్లకు సాకారమైందన్నారు. భారత్‌లో అపూర్వ స్వాగతం లభించడం గౌరవంగా భావిస్తున్నానన్నారు.
ఢిల్లీ ఎంతో బాగుందని, ఇక్కడి సంస్కృతి, ప్రజలు తనకు చాలా ఇష్టమన్నారు. 25 ఏళ్ల షరపోవా ఢిల్లీలో ఉల్లాసంగా గడిపింది. ఒకరోజు పర్యటనలో భాగంగా శనివారం రాత్రి ఇక్కడి వచ్చింది. తాజ్‌మహల్‌ను సందర్శించాలని ఉందని, త్వరలోనే మరోసారి భారత పర్యటనకు వస్తానని షరపోవా చెప్పింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications