Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

భూపతి - బోపన్నలతో పాటు జ్వాలా - పొన్నప్ప అవుట్

London Olympics: Bhupathi-Bopanna, Jwala-Ponappa crash out
లండన్, ఆగస్టు 1: లండన్ ఒలింపిక్స్ బయలుదేరి వెళ్లడానికి ముందు భారత్ టెన్నిస్ చరిత్రలో అతి పెద్ద వివాదానికి తెర తీసిన మహేశ్ భూపతి - రోహన్ బోపన్నల ఆట లండన్ ఒలింపిక్స్‌లో ముగిసింది. పురుషులు డబుల్స్ విభాగంలో ఏడో సీడ్‌గా బరిలోకి దిగిన భారత జంట ఫ్రాన్స్ అన్ సీడెడ్ జోడీ చేతిలో పరాజయం పాలైంది. లియాండర్ పేస్‌తో ఆడనంటే ఆడనని.. తామిద్దరం అయితేనే డబుల్స్ మ్యాచ్‌లో కలిసి ఆడతామని తెగేసి చెప్పడమే కాకుండా... ఏఐటీఏతో అమీతుమీకి సిద్ధమైన ఈ ఇద్దరూ ఓటమితో లండన్ ప్రయాణం ముగిసింది.

నేను, బొపన్న కలిసి చాలా కాలంగా ఒలింపిక్ పతకం కోసమే సిద్ధమయ్యాం... మా మధ్య ఉన్న సమన్వయానికి పతకం ఖాయం ఇది మహేశ్ భూపతి వ్యాఖ్య. భూపతితో తప్ప మరొకరికే ఆడే ప్రసక్తే లేదు. ఎలాంటి పరిణామానికైనా సిద్ధం. ఇదీ దాదాపు నెల క్రితం భూపతి, బొపన్నల చెప్పిన మాటలు. కేవలం మాటలకే పరితమమైన వీరిద్దరూ ఫ్రాన్స్ ఆటగాళ్లైన గాస్కె - బెన్నెటె చేతిలో 6-3, 6-4 తేడాతో మహేశ్ - రోహన్‌లను చిత్తుగా ఓడిపోయారు. మొత్తం 77 నిమిషాల్లో ఈ మ్యాచ్ ముగిసింది.

తొలి సెట్‌లో రెండు సార్లు బ్రేక్ సాధించిన ఫ్రాన్స్ 4-1 ఆధిక్యంలో నిలిచింది. ఆ తర్వాత భారత జోడి రెండు పాయింట్లు సాధించి ప్రత్యర్థి ఆధిక్యాన్ని 5-3కు తగ్గించారు. అయితే చివరి గేమ్‌లో సర్వీస్ నిలబెట్టుకున్న ఫ్రాన్స్ 6-3తో సెట్‌ను గెల్చుకుంది. రెండో సెట్‌లో తేరుకున్న భూపతి-బోపన్న వరుసగా మూడు గేమ్‌లు నెగ్గి 3-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లినా ఫ్రాన్స్ జోడీ పుంజుకుని సెట్, మ్యాచ్ గెలుచుకుంది.

ఇది ఇలా ఉంటే మహిళల బ్యాడ్మింటన్ డబుల్స్‌లో జ్వాల జోడీ క్వార్టర్స్‌కు అర్హత సాధించలేక పోయారు. గ్రూపులో మరో రెండు జట్లతో పాటు సమానంగా రెండు మ్యాచ్‌ల్లో నెగ్గినా... పాయింట్ల తేడాతో ఇంటి ముఖం పట్టారు. చివరి లీగ్‌లో 13 పాయింట్ల తేడాతో వరుస గేముల్లో మ్యాచ్ గెలిస్తే జ్వాల జోడీ క్వార్టర్స్‌కు చేరేది. కానీ 11 పాయింట్ల తేడాతో మాత్రమే గెలిచి ఒలింపిక్స్ నుండి డబుల్స్ విభాగంలో నిష్క్రమించింది.

తెలుగు వన్ఇండియా

Story first published: Tuesday, November 14, 2017, 10:15 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+