Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

పేస్ ధక్కా: ఒలింపిక్స్ నుంచి తప్పుకుంటానని హెచ్చరిక

Leander Paes
న్యూఢిల్లీ: ప్రముఖ భారత టెన్నిస్ క్రీడాకారుడు లియాండర్ పేస్ అఖిల భారత టెన్నిస్ సంఘానికి (ఎఐటిఎ)కి ధక్కా ఇచ్చాడు. 207/ 306 ప్రపంచ ర్యాంక్ గల క్రీడాకారుడితో జత కట్టాలని ఆదేశిస్తే తాను లండన్ ఒలింపిక్స్ క్రీడల నుంచి తప్పుకుంటానని హెచ్చరించాడు. ఈ మేరకు ఎఐటిఎకు ఆతను నోటీసు ఇచ్చాడు. మహేష్ భూపతితో గానీ రోహన్ బోపన్నతో గానీ జత కట్టడానికి తాను సిద్ధంగా ఉన్నానని అతను ఎఐటిఎ కార్యదర్శి భరత్ ఓఝాకు రాసిన లేఖలో తెలిపాడు.

వచ్చే ఒలింపిక్స్‌లో తాను మహేష్ భూపతికి లేదా రోహన్ బోపన్నకు సౌకర్యవంతమైన జతగాడినని అతను చెప్పాడు. దేశం కోసం తనతో ఆడడానికి మహేష్, బోపన్న నిరాకరిస్తే ఆ తర్వాతి ఉత్తమ క్రీడాకారుడితో జత కట్టడానికి సిద్ధంగా ఉన్నానని అతను చెప్పాడు. తాను మంచి ర్యాంకింగ్ ఉన్న క్రీడాకారుడినని, దేశానికి పతకం సాధించాలంటే తనకు సరైన జోడీ కావాలని పేస్ అన్నాడు.

పేస్‌కు జోడీగా మహేష్ భూపతి పేరును గతవారం ఎఐటిఎ ప్రకటించింది. అయితే, పేస్‌తో జత కట్టడానికి భూపతి నిరాకరించాడు. ఆ తర్వాత రోహన్ బోపన్న కూడా తిరస్కరించాడు. ప్రపంచం ఏడో నెంబర్ క్రీడాకారుడైన పేస్‌కు నేరుగా ప్రవేశించే అర్హత ఉంది. దాంతో తన జతగాడిని ఎంపిక చేసుకునే అవకాశం ఉంటుంది.

మిక్స్‌డ్ డబుల్స్‌లో సానియా మీర్జాతో జత కట్టాలని పేస్ భావిస్తున్నాడు. అయితే, వైల్డ్ కార్డు ఎంట్రీ సానియాకు లభిస్తేనే అది సాధ్యమవుతుంది. వారిద్దరి జోడీ ఇటీవల ఫ్రెంచ్ ఓపెన్ మిక్స్‌డ్ డబుల్స్ టైటిల్ గెలుచుకుంది. మిక్స్‌డ్ డబుల్స్‌లో సానియాకు డైరెక్ట్ ఎంట్రీ లభిస్తుందని పేస్ అంటున్నాడు.

మహేష్ భూపతి, రోహన్ బోపన్న తన నిర్ణయాన్ని తిరస్కరించడాన్ని ఎఐటిఎ అనుమతిస్తే చెడు సంప్రదాయం ప్రారంభమవుతుందని పేస్ అన్నాడు. మహేష్, బోపన్న తీరు భారత క్రీడలకు, ముఖ్యంగా టెన్నిస్ క్రీడకు మంచిది కాదని అతను అన్నాడు.

Story first published: Tuesday, November 14, 2017, 10:15 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+