యుఎస్ ఓపెన్: పురుషుల డబుల్స్ ఫైనల్స్‌లో పేస్ జోడీ

సెమీ ఫైనల్స్‌లో భాగంగా లియాండర్ పేస్, చెక్ రిపబ్లికన్ ఆటగాడు రాడిక్ స్టెపానిక్ జంట ఆరో సీడ్ జంట మార్సెల్ గ్రానోలర్స్, మార్క్ లోపెజ్‌లపై విజయం సాధించారు.
ప్రత్యర్ది జంట మ్యాచ్ నుంచి 6-6 స్కోరు వద్ద అర్థాంతరంగా రిటైర్ కావడంతో విజేతలుగా పేస్ జోడీని ప్రకటించారు. దీంతో ఇటీవలే ఆస్ట్రేలియా ఓపెన్ టైటిల్‌ను గెలుచుకున్న పేస్-స్టెపానిక్ జోడీ యుఎస్ ఓపెన్ టైటిల్‌కు మరింత చేరువయింది.
లియాండర్ పేస్, చెక్ రిపబ్లికన్ ఆటగాడు రాడిక్ స్టెపానిక్ జోడీ ఫైనల్‌లో అమెరికన్ జంట బాబ్ అండ్ మైక్ బ్రియాన్, పాక్-నెదర్లాండ్స్ జోడీ జంట హ్యాషీమ్ అల్ హక్ ఖురేషీ, జీన్ జులియన్ రోజర్‌ల మధ్య శుక్రవారం జరిగే మరో సెమీ ఫైనల్ విజేతతో తలపడనుంది. అంతక ముందు క్వార్టర్ పైనల్స్ లో పేస్ జోడీ 6-2, 6-4తో జులయిన్‌నోల్ (ఆస్ట్రియా), ఫిలిప్ పోలాసెక్ (స్లోకేవియా) జంటపై విజయం సాధించింది.
ఇక మిక్స్‌డ్ డబుల్స్ టైటిల్‌ను మకరోవ (రష్యా), సోరెస్ (బ్రెజిల్) జోడీ గెలుచుకుంది. మిక్స్‌డ్ డబుల్స్ టైటిల్ కోసం జరిగిన ఫైనల్ పోరులో మరోవ జోడీ 6-7 (8/10), 6-1, 1-0, (12-10)తో పచ్ కే(చెక్), మత్కోఫ్‌స్కి (పోలెండ్)పై విజయం సాధించింది.
తెలుగు వన్ఇండియా
Story first published: Tuesday, November 14, 2017, 10:15 [IST]
Other articles published on Nov 14, 2017
Log in for Better Reading Experience!
By signing in, you agree to our Terms and Privacy Policy
Gender
Select your Gender
- Male
- Female
- Others
Age
Select your Age Range
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications