
మూడో సీడ్ లియాండర్ పేస్ (భారత్)-వెస్నినా (రష్యా) జోడిని చెక్ రిపబ్లిక్ జోడీ లూసీ సెర్మాక్ జంట 6-7 (2), 5-7 స్కోరుతో కేవలం 43 నిమిషాల్లోనే ఓడించింది.
ఈ మ్యాచ్‌లో లియాండర్ పేస్, ఎలీనా జంట 67 పాయింట్లు సాధించగా, వీరి ప్రత్యర్థి జోడీ 80 పాయింట్లను సొంతం చేసుకుంది.
అలాగే సానియా మీర్జా తన బ్రిటీష్ భాగస్వామి కోలిన్ ఫ్లెమింగ్‌తో కలిసి బరిలోకి దిగగా నాలుగో సీడ్, చెక్ రిపబ్లిక్ క్రీడాకారిణి క్వెటా పెస్చే, పోలాండ్ క్రీడాకారిణి మర్సిన్ మతోస్కీ చేతిలో వరుస సెట్లలో 6-3, 5-7 స్కోరుతో ఓటమిని చవిచూశారు. సానియా - కోలిన్ జంట ఏకంగా ఎనిమిది బ్రేక్ పాయింట్లను వృధా చేసుకుంది.
అంతక ముందు మిక్స్‌డ్ డబుల్స్ రెండో రౌండ్‌లో మహేశ్ భూపతి (భారత్)-హలవకోవా (చెక్ రిపబ్లిక్) జోడి తమ ప్రత్యర్థికి 'వాకోవర్' ఇచ్చింది. లియాండర్ పేస్ (భారత్)-వెస్నినా (రష్యా) జోడి మూడో రౌండ్‌లో 4-6, 6-4, 10-5తో అబిగెల్ స్పియర్స్-స్కాట్ లిప్‌స్కీ (అమెరికా) జంటను ఓడించి క్వార్టర్ ఫైనల్‌కు చేరుకుంది.
మిక్స్‌డ్ డబుల్స్ మూడో రౌండ్‌లో సానియా-కొలిన్ ఫ్లెమింగ్ (బ్రిటన్) జంట 6-4, 7-6 (9/7)తో మెలానీ ఉడిన్-జాక్ సాక్ (అమెరికా) జోడిపై గెలిచి క్వార్టర్ ఫైనల్‌కు చేరుకుంది. యుఎస్ ఓపెన్‌లో భారత స్టార్ మిక్స్‌డ్ డబుల్స్ జోడీ మహేష్ భూపతి - సానియా మిర్జాలు కలిసి ఆడకూడదని నిర్ణయించుకున్న విషయం తెలిసిందే. రస్తుతం జరుగుతున్న సీజన్ చివరి గ్రాండ్‌స్లామ్ యూఎస్ ఓపెన్‌లో సానియా... బ్రిటన్ డబుల్స్ స్పెషలిస్ట్ కొలిన్ ఫ్లెమింగ్‌తో జతకట్టగా, భూపతి... అండ్రియా హల్వకోవా (చెక్)తో కలిసి బరిలోకి దిగారు.
తెలుగు వన్ఇండియా