విష్ణు ఆశలపై నీళ్లు: ఒలింపిక్స్ నుంచి పేస్ అవుట్

లండన్‌కు రెండు జట్లను పంపుతున్నట్లు ఎఐటిఎ బుధవారం ఉదయం ప్రకటించింది. మహేష్ భూపతి, రోహన్ బోపన్న ఒక జోడీగా, లియాండర్ పేస్, విష్ణువర్ధన్ మరో జోడీగా లండన్ వెళ్తారని సంఘం ప్రకటించింది. అయితే జూనియర్ ఆటగాడిని తనకు జతగాడిగా నిర్ణయిస్తే ఒలింపిక్స్ నుంచి తప్పుకుంటానని పేస్ బుధవారంనాడు హెచ్చరించారు.
లియాండర్ తండ్రి, ఒపింపియన్ వేసే పేస్ కూడా ఎఐటిఎ నిర్ణయంపై ధ్వజమెత్తారు. ప్రపంచ నెంబర్ 328 క్రీడాకారుడు విష్ణు వర్ధన్‌ను తన కుమారుడికి జోడీగా నిర్ణయించడం సరి కాదని ఆయన అన్నారు. దేశ అత్యున్నత స్థాయి ర్యాంక్ ఆటగాడి పట్ల అది అన్యాయమేనని ఆయన అన్నారు.
విష్ణువర్ధన్ పేస్‌తో ఆడడానికి చాలా ఉత్సాహం ప్రదర్శించాడు. ఈ అవకాశం వచ్చినందుకు అతను ఆనందించాడు. అయితే, పేస్ నిర్ణయం మరో విధంగా ఉండడం విష్ణువర్ధన్‌కు నిరాశ మిగిల్చిందనే చెప్పాలి. పేస్ తాజా నిర్ణయంతో భారత టెన్నిస్ క్రీడలో వివాదం మరింత ముదిరింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications