
రియాల్టీ షోలో అతిథి దంపతులుగా పాల్గొంటున్నందుకు తనకు ఎంతో ఆనందంగా ఉందని సానియా మీర్జా మీడియా ప్రతినిధుల సమావేశంలో చెప్పింది. ఎంతో రిహార్సల్ చేశామని, తమ సంగీత్ కోసం సిద్ధమై నాట్యం చేశామని ఆమె చెప్పింది. సమన్వయం కాస్తా కష్టమేనని, స్టెప్పులు కూడా గుర్తుండవని ఆమె అన్నది.
తన పెర్‌ఫార్మెన్స్ మీదనే తాను పూర్తి దృష్టి పెట్టానని, తాను బాగా చేయగలననే అనుకుంటున్నానని, క్రికెట్ తన పాషన్ అని, నాట్యం చేసినా ప్రతిభ కనబరచాలని చూస్తానని ఆయన అన్నారు. సానియా పాకిస్తాన్‌కు ప్రాతినిధ్యం వహించాలని తాను ఎన్నడూ కోరలేదని స్పష్టం చేశారు.
నాచే బలియే రియాల్టీ షో 5 ఈ నెల 29వ తేదీ నుంచి ప్రతి శనివారం స్టార్ ప్లస్‌లో ప్రసారమవుతోంది. ఈ షోకు ఈ ఏడాది బాలివుడ్ డ్యాన్సర్ శిల్పా శెట్టి కుంద్రా, ప్రముఖ దర్శకుడు సాజీద్ ఖాన్, కోరియోగ్రాఫర్ టెరెన్స్ లూయిస్ న్యాయమూర్తులుగా వ్యవహరిస్తారు.