Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

వైల్డ్ కార్డ్ ఎంట్రీపై ఆశలు సజీవంగా ఉన్నాయి: సానియా

Sania Mirza
న్యూఢిల్లీ, జూన్ 1: భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా తనకింకా ఒలింపిక్స్ ఆవకాశాలు సజీవంగానే ఉన్నాయని తెలిపింది. ఫ్రెంచ్ ఓపెన్ మహిళల డబుల్స్ తొలిరౌండ్లోనే నిష్క్రమించి లండన్ ఒలింపిక్స్ బెర్త్ అవకాశాలను కష్టతరం చేసుకున్న సానియా మీర్జా ఇప్పుడు వైల్డ్ కార్డ్ ఎంట్రీపై ఆశలు పెట్టుకుంది. ఒలింపిక్స్‌ నిబంధన ప్రకారం టాప్‌-10లో ఉండే ఆటగాళ్లకు మాత్రమే నేరుగా ప్రవేశం కల్పిస్తారు.

'వైల్డ్‌కార్డ్‌కు నేను అర్హురాలిని. బెర్తు కోసం ఆశావహంగా ఎదురుచూస్తున్నాను. ఒలింపిక్స్‌లో ఆడతాననే విశ్వాసంతో ఉన్నాను' అని పారిస్‌లో ఉన్న సానియా తెలిపింది. కాగా, సానియా ఒలింపిక్స్‌కు నేరుగా అర్హత సాధించాలంటే జూన్ 11వరకు ఆమె వ్యక్తిగత డబుల్స్ ర్యాంకింగ్స్‌లో టాప్‌టెన్‌లో కొనసాగాలి. టాప్‌టెన్‌లో చోటు దక్కకపోతే సానియాకు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా లండన్ ఒలంపిక్స్ బరిలో నిలిచే అవకాశం ఉంది.

సింగిల్స్‌లో 185వ ర్యాంక్‌లో ఉన్న సానియా.. అఖిల భారత టెన్నిస్ సంఘానికి సింగిల్స్‌లో 'వైల్డ్ కార్డు' కేటాయించాలని అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్యకు దరఖాస్తు చేసింది. అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య 'వైల్డ్ కార్డు' కేటాయిస్తేనే సానియా సింగిల్స్‌తోపాటు మిక్స్‌డ్ డబుల్స్‌కు ఆడే అవకాశం ఉంటుంది. వైల్డ్‌కార్డ్ కోసం దరఖాస్తులను పరిశీలించిన అనంతరం అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య(ఐటీఎఫ్) జూన్ 28న అర్హత పొందిన క్రీడాకారుల జాబితాను ప్రకటిస్తుంది.

ఆసక్తికరంగా సాగిన మ్యాచ్‌లో సానియా-బెథానీ జోడి 3-6, 6-4, 5-7తో నీనా బ్రాత్చికోవా (రష్యా)-ఎడీనా గలోవిట్స్ (రుమేనియా) జంట చేతిలో పరాజయం పాలైంది. ఇదే టోర్నీలో గతయేడాది ఎలీనా వెస్నినా (రష్యా)తో కలిసి సానియా డబుల్స్‌లో రన్నరప్‌గా నిలిచింది. దీంతో జూన్ 11న విడుదల చేసే డబుల్స్ ర్యాంకింగ్స్‌లో టాప్-10లో ఉన్న వారికే లండన్ ఒలింపిక్స్‌లో పాల్గొనే అవకాశం ఉంది. ప్రస్తుతం 10వ ర్యాంక్‌లో ఉన్న సానియా మిర్జా ఈ ఓటమితో ర్యాంక్ దిగజారే అవకాశం ఉంది.
Story first published: Tuesday, November 14, 2017, 10:15 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+