Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అవమానించి, తగువు తీర్చేందుకు ఎరగా: సానియా

న్యూఢిల్లీ, జూన్ 27: లండన్ ఒలంపిక్స్‌లో ఆడేందుకు వైల్డ్‌ కార్డు ద్వారా అనుమతి లభించిన తర్వాత సానియా మీర్జా మీడియా ముందు నోరు విప్పారు. లండన్ ఒలంపిక్స్‌లో ఇండియా తరుపున పాల్గోనడం నిజంగా ఆనందాన్నిస్తుంది. నా జీవితంలో రెండవ సారి ఒలంపిక్స్‌కు నా భారతదేశం తరుపున ఆడడంతో వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా నాకు అవకాశం కల్పించిన అంతర్జాతీయ టెన్నిస్ ఫెడరేషన్‌కు కృతజ్ఞతలు తెలియజేస్తానని అన్నారు. పేస్‌తో మిక్స్‌డ్‌ డబుల్స్‌ ఆడేందుకు సిద్దమన్న సానియా మిర్జా.. టెన్నిస్‌ సంఘం తనను అవమానించిందని పేర్కొంది. టెన్నిస్‌ సంఘంతో పాటు పేస్‌, భూపతిలపైన కూడా సానియా తీవ్ర స్థాయిలో స్పందించింది.

Sania Mirza

ఇటీవల కాలంలో అఖిల భారత టెన్నిస్ సంఘం లండన్ ఒలంపిక్స్‌‌కు ఎంపిక చేసిన జట్లపై చాలామంది స్నేహితులు, మీడియా చాలా సందేహాలను వెలిబుచ్చారు. నేను ఆర్హత సాధించలేదు కాబట్టి ఈ ప్రశ్నలకు పూర్తిగా ఊహాత్మక భావించాను, ఆ సమయంలో వారికి ప్రతిస్పందన కోసం అది సరైన భావించ లేదు. ఇక మిక్సడ్ డబుల్స్ ఈవెంట్ ఎంపికపై భారత టెన్నిస్‌ క్రీడాకారిణి సానియా మీర్జా ఆల్‌ ఇండియన్‌ టెన్నిస్‌ అసోసియేషన్‌పై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఒలింపిక్స్‌ కోసం మిక్స్‌డ్‌ డబుల్స్‌ టీమ్‌ను ఎంపిక చేసిన తీరుపై ఆమె ధ్వజమెత్తింది.

అయితే ఇటీవల ఇండియన్‌ టెన్నిస్‌లో జరగుతున్న పరిణామాలు తనను వత్తిడికి గురిచేశాయని సానియా తెలిపింది. 21వ శతాబ్దపు భారతీయ మహిళగా నాకిది అవమానం. రెండు గ్రాండ్ స్లామ్‌లు గెలిచిన, దశాబ్దకాలంగా భారత్ నెంబర్ వన్ క్రీడాకారిణిగా ఉన్న నన్ను ఎంపిక చేసిన తీరు పురుషాధిక్యానికి నిదర్శనం.

ఒక ఇష్టం లేని ఆటగాడితో పరుషుల డబుల్స్‌లో కలిసి ఆడేందుకు ఒక ఆటగాన్ని ఒప్పించడం కోసం న్ను ఆశగా చూపడం భారతీయ మహిళగా నాకు తీవ్ర అవమానం. కొన్ని రోజుల క్రితం గ్రాండ్ స్లామ్ టైటిల్‌ను గెలిచిన జోడి (భూపతి-సానియా) విడదీయడానికి చెప్పిన కారణాలు ఆశ్చర్యం. మిక్స్‌డ్ డబుల్స్‌లో లియాండర్ పేస్‌తో కలిసి ఆడతానని నేను లిఖిత పూర్వక హామీ ఇవ్వాలని డాక్టర్ వీస్ పేస్ బహిరంగంగా అడగడం ఎంత వరకు సమంజసం. ఏది ఏమైనప్పటికీ దేశానికే ప్రాధాన్యమని స్పష్టం చేయదలుచుకున్నా.

నా ఇష్టాలెలా ఉన్నా, దేశం కోసం పేస్, భూపతి, సోమ్ దేవ్, బోపన్న, విష్ణు లేదా మరెవరితోనైనా ఆడేందుకు సిద్దం. భారతదేశానికి పతకాన్ని అందిచండానికి శక్తి వంచన లేకుండా ప్రయత్నిస్తా. పేస్ వంటి గొప్ప ఆటగాడితో కలిస్తే విష్ణు ఇంకా బాగా అడతాడు. నేను తనతో ఆడితేనే విష్ణుతో కలిసి డబుల్స్ ఆడతానని పేస్ అనడంలో అది నాకు, పేస్, విష్ణుకు అవమానం అని చెప్పింది. ఇద్దరు ఆటగాళ్ల మధ్య తగువు తీర్చేందుకు తనను ఎరగా వాడుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. మహిళల డబుల్స్‌లో సానియా-రష్మీ చక్రవర్తిల జోడీకి ఐటీఎఫ్ వైల్డ్‌కార్డ్ ఇచ్చింది.

మరోవైపు పురుషుల సింగిల్స్ విభాగంలో ఆడేందుకు సోమ్‌దేవ్ దేవ్‌వర్మన్‌కు వైల్డ్‌కార్డ్ ఎంట్రీ లభించింది. భారత్ ఇప్పటికే పురుషుల డబుల్స్ విభాగంలో రెండు ఎంట్రీలను పంపింది. దీంతో మొత్తం ఒలింపిక్స్‌లో పాల్గొనే భారత టెన్నిస్ క్రీడాకారుల సంఖ్య ఏడుకు చేరింది. సానియా జోడీకి, సోమ్‌దేవ్‌కు వైల్డ్‌కార్డ్ ఇస్తున్నట్లు మంగళవారం నాడు ఐటీ ఎఫ్ అధ్యక్షుడి నుంచి ఏఐటీఏకు సమాచారం వచ్చిన విషయం తెలిసిందే.

తెలుగు వన్ఇండియా

Story first published: Tuesday, November 14, 2017, 10:15 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+